వెంకటగిరి : రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగడ్తూ యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలంటూఎంపీడిఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ జీవో కాపీకి నిప్పుబెట్టారు. ఈ సందర్భంగా ఈటీఎఫ్ నాయకులు కుమార్ స్వామి మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయ అప్రెంటిస్ విధానాన్ని పోరాటం చేసి సాధించుకున్నాము. గత ప్రభుత్వంలో రద్దు చేసిన జిఓని మరల వైసిపి ప్రభుత్వం అమలు చేయాలని తీసుకు రావడం తగదని ఉపాధ్యాయులకు ఎన్నడు లేని విధంగా ఈ జీవన్ తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.