బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
అవసరాలు నిమిత్తం మండలంలోని జయంపు గ్రామంలోని సబ్ స్టేషన్ లో సిఫ్ట్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న కూరపాటి.రవి ఆదే గ్రామంకు చెందిన దేవరపల్లి సంపూర్ణమ్మ వద్ద రూ 8 వేలు తీసుకున్నాడు.ఆమే అప్పు అడిగినందుకు దాడిచేశాడని మంగళవారం పోలీసులకు పిర్యాదు చేశారు. స్థానిక ఎస్సై మహబూబ్ సుభాన్ కథనం మేరకు గత నెలలో సబ్ స్టేషన్ లో సిఫ్ట్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న రవి.సంపూర్ణమ్మ వద్ద రూ 8 వేలు అప్పు తీసుకోవడం జరిగింది.ఆడబ్బ లు గత నెల క్రితం రూ 2 వేలు తిరిగిచ్చాడు.ఈ నెలలో 13 తేది రూ 6 వేలు ఇస్తామని చెప్పడంతో డబ్బులు అడిగినందుకు ఆమెపై గోడలకు దిగి దాడి చేశాడు.దింతో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.