విద్యే నిజమైన సంపద అని నమ్మిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థకు పెద్ద పీట వేశారు: జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
తిరుపతి జిల్లా లోని 691 గ్రామ వార్డు సచివాలయాల్లోని 11875 మంది వాలంటీర్ లకు పురస్కారాలు: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
నిస్వార్థ సేవకులు వాలంటీర్లకు సలాం: ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేరుస్తున్న వాలంటీర్లు నిజమైన ప్రజా సేవకులు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిటకు తెచ్చి సుపరిపాలన అందిస్తోందని జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వరుసగా నాలుగో సంవత్సరం వాలంటీర్ లకు అభినందన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుండి ప్రారంభించగా వర్చువల్ విధానంలో ప్రత్యక్ష ప్రసారం వీక్షించే విధంగా స్థానిక తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయగా జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ, స్థానిక ఎంపీ గురుమూర్తి సంబంధిత అధికారులతో కలిసి జిల్లాలోని వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదవాడికి సేవ చేస్తే దేవుడికి చేసినట్లే అని నమ్మి ప్రజా సేవ చేయాలని తపిస్తున్న వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల ముంగిటకు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా చాలా చక్కగా అందుతున్నాయని అన్నారు. విద్యే అన్నింటికీ మూలం అని అన్నారు. కోటీశ్వరుడు వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియం లో చదివించి మంచి విద్య అందించాలని చూస్తారో, అలాగే పేద ప్రజల పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలలలో అమలుతో నాణ్యమైన విద్య అందిస్తూ వారు దేశ విదేశాల్లో రాణించేలా వారికి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాల అమలుతో మంచి చేకూర్చడం జరుగుతోందని అన్నారు. అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు సేవలను అందిస్తున్న వాలంటీర్లకు ధన్యవాదాలు అని అన్నారు. రాష్ట్రంలో నేడు 2,55,464 మంది సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులను అందుకుంటున్నారని వాలంటీర్ ల పని తీరుకు ఇది నిదర్శనంగా భావించి హితోదిక పారితోషకంగా ప్రతిభ కనపరచిన సేవా వజ్ర లకు రూ. 45 వేలు, సేవారత్నాలకు రూ.30 వేలు, సేవామిత్ర లకు రూ. 15 వేలు తో పాటు మెడల్, బ్యాడ్జ్, ప్రశంసా పత్రం, శాలువాతో సన్మానాలు చేస్తున్నారని, వాలంటీర్ లు మరింత సేవలందించేలా ఉండాలని ఆశిస్తున్నానని అన్నారు. జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న వాలంటీర్లకు నేడు రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం జరిగిందని, మన తిరుపతి జిల్లాలో సేవ వజ్ర 37 మందికి అలాగే ఎంపిక చేయబడిన టెస్టిమోనియల్స్ 48 మందికి, సేవ రత్న 216 మందికి, సేవ మిత్ర 11413 మందికి వెరసి మొత్తం 11666 మంది అభినందన పురస్కారాలు అందనున్నాయని తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలకు ఎంతో చేరువగా ఉంటూ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు అని అన్నారు. కోవిడ్, తుఫాన్ తదితర ప్రకృతి వైపరీత్యాల లో వాలంటీర్లు సేవలు వెల కట్టలేనివని, వారి సేవలను ప్రభుత్వం గుర్తించి సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర లుగా సన్మానిస్తూ నగదు పురస్కారాలు అందించడం సంతోషం గా ఉందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి పాలన అందుతోందని కొనియాడారు.
జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారిని వివరిస్తూ సేవ రత్న లుగా ఎంపికైన వాలంటీర్లు కు మరియు సేవా మిత్ర లుగా ఎంపైన వాలంటీర్లకు పురస్కారాలను మండల మరియు మున్సిపాలిటీ స్థానంలో గౌరవ ప్రజా ప్రతినిధుల ద్వార ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఎంపిక చేయబడ్డ రోజుల్లో అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వాలంటీర్లకు ఉప ముఖ్యమంత్రి తదితరులు శాలువా కప్పి, మెడల్, బ్యాడ్జి, ప్రశంసా పత్రాలను అందచేసి సన్మానం చేసారు. ఈ సన్మాన కార్యక్రమం లో జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారిణి సుశీల దేవి, డిప్యూటీ సిఈఓ ఆదిశేషా రెడ్డి తదితర అధికారులు, వాలంటీర్ లు పాల్గొన్నారు.