సరికొత్త ర్యాంప్, పార్టీ ప్రచార పాట, పది లక్షలు పై చిలుకు పార్టీ శ్రేణులు, మేనిఫెస్టో ఆవిష్కరణ!
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి జగన్ పార్టీ శ్రేణులును ఉద్దేశించి ఈ సారి జరుగనున్న ఎన్నికల ‘యుద్ధం’, మంచికి మరియు చెడుకి మధ్య పోరు అని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తనని క్రిందికి దించిందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తన శ్రేణులను ఇప్పటికే సందేశాన్నిచ్చారు. ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ క్యాడర్ మీటింగ్స్ నిర్వహిస్తూ క్షేత్రస్థాయికి చేరుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సిద్దం క్యాడర్ మీటింగుల్లో భాగంగా, ఇప్పటికే రెండు సభలను నిర్వహించింది, మొదటిది ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ భీమిలిలో నిర్వహించగా, రెండవది ఏలూరులో కోస్తా ఆంధ్ర జిల్లాలోని నియోజకవర్గాలను కవర్ చేస్తు నిర్వహించింది. వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో రేపు అనంతపురంలో మూడో సిద్దం సభా జరగనుంది. అదే విధంగా నాలుగో సిద్దం మీటింగ్ పల్నాడులో నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. రేపు జరగనున్న మూడవ సిద్ధం ర్యాలీలో 10 లక్షల పై చిలుకు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు హాజరవుతారని పార్టీ అంచనా వేస్తుంది. అలాగే అనంతపురంలో రేపు జరగనున్న ర్యాలి దక్షిణభారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ ర్యాలీగా నిలవనున్నది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల పోరులో భాగంగా నిరంతరం సరికొత్త అంశాలను ఆవిష్కరిస్తూ ఎన్నికల స్ట్రాటజీలతో జనంలోకి దుస్కుకెళ్తు, ప్రతిపక్షాలు అధికార పార్టీని ఎదుర్కునే అవకాశమే ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తుంది. సిద్దం సభలలో సీఎం జగన్ క్యాడర్ అభివాదం చేస్తూ నడిచే ర్యాంప్ ని అనంతపురం సిద్దం సభలో మరింత పెంచనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. భీమిలిలో జరిగిన సిధ్ధం సభలో ఏర్పాటు చేసినా ర్యాంప్ పై నుంచీ కార్యకర్తలను, అభిమానులు మధ్య నడిచి ఒక ట్రెండ్ సెట్ చేసిన సీఎం జగన్. అదే ట్రెండ్‌ను అనుసరిస్తూ, ఏలూరులో భారీ ఫ్యాన్ ఆకారంలో ర్యాంప్ ఏర్పాటు చేయబడింది, ఇది వేదిక పొడవు, వెడల్పుతో సీఎం జగన్ వేదికను కలుపుతుంది. అనంతపురంలో జరగనున్న ర్యాలీలో మరింతగా పెంచేందుకు మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదంతో పార్టీ ఎన్నికల ప్రధాన ప్రచార గీతాన్ని విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రచార గీతం రాష్ట్రములోని స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యువత సీఎం జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకన్ని తెలిపే విధంగా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 2019లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో అలాగే పార్టీ విజయంలో కీలక భూమిక పోషించిన ‘రావాలి జగన్ కావాలి జగన్’ రికార్డులను ఈ కొత్త ప్రచార పాట బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ మేనిఫెస్టోను కూడా సీఎం జగన్ విడుదల చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేనిఫెస్టోలో ఇప్పుడు అమలులో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని సరికొత్త పథకాలను నవరత్నాల క్రింద జోడించి ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని భావిస్తున్నారు. మేనిఫెస్టోలో ఆచరణాత్మకమైన పథకాలను మాత్రమే సీఎం జగన్ ప్రకటన చేస్తారని మరింత సమాచారం. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే రాజాకీయ నాయుకుడిగా పేరు గడించిన సీఎం జగన్, ఆయన మరోమారు సరికొత్త ఎలక్షన్ మేనిఫెస్టోతో మన అందరి ముందుకూ వస్తారు అని పార్టీ వర్గాలు తెలిపాయి.