పట్టించుకోని రోడ్డు భవనలశాఖ
ఆదుమరిస్తే గాలిలో ప్రణాలు
బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
నాయుడుపేట – వెంకటగిరి రోడ్డు మార్గం
బాలాయపల్లి మండలం సంగవరం రోడ్డు వద్ద ప్రధాన రహదారి పై మధ్యలో గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారి ఉండటంతో స్థానికులు ఈ గుంత లో ఎవరైనా ప్రమాదాల బారిన పడతా రేమోనని ముల్లకంపనను అడ్డుగా వేసి ఉన్నారు. ఆర్ అండ్ బి అధికారులు దెబ్బతిన్న రహదారిని పట్టించుకోవడంలేదని స్థానికులతో పాటు వాహన దారులు వాపోతున్నారు. ఈ రోడ్డు మార్గంలో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, స్కూల్ బస్సులు, ఇదే మార్గంలో ప్రయాణించాల్సి ఉంది. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా అధికారులు రహదారికి మరమ్మత్తులు చేపట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దెబ్బతిన్న రహదారి కి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
పోటో:-రోడ్డుకు గుంతలు పడ్డ దృశ్యం