వెంకటగిరి….. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇంచార్జ్
మంగళపూరి సురేష్ మాదిగ
MRPS వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ* గారి ఆదేశాల మేరకు వెంకటగిరి ఎమ్మార్పీఎస్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వెంకటగిరి లో ఉన్న స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా MRPS నియోజకవర్గ ఇన్చార్జ్ మంగళపూరి సురేష్ మాదిగ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 20న జరుగు వికలాంగుల హక్కుల పోరాట సమితి(VHPS) రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం చేయాలని ఆయన తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు పాల్గొని ఉన్నారు.వికలాంగులకు 6000 పెన్షన్,ప్రత్యేక మంత్రి శాఖ వికలాంగులు,ప్రతి ఒక్కరకు అంత్యోదయ రేషన్ కార్డును మరియు ఆర్టీసీ బస్సులు వికలాంగులు ఉచిత ప్రయాణం కల్పించాలని ఆయన తెలియజేశారు.వికలాంగుల ఆర్థికంగా ఎదగాలంటే బ్యాంకులలో ఐదు లక్షల వరకు రుణాలు మంజూరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అన్ని కులాల మతాల వికలాంగుల కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి వికలాంగుల ఆపద్బాంధవుడు MRPS వ్యవస్థపకులు మందకృష్ణ మాదిగ గారు అని తెలియజేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న వికలాంగులు స్వచ్ఛందంగా గుంటూరు లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో mrps నియోజకవర్గ నాయకులు చిగురుపాటి శివ, ప్రశాంత్, వెంకటగిరి టౌన్ నాయకులు వీరరాఘవులు బాలయపల్లి, రాపురు మండల నాయకులు రాజుకుమార్, అంకయ్య,గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.