గుడివాడలో కలకలం రేపుతున్న బ్యానర్లు
కొడాలి నాని స్థానంలో హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం
హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ గుడివాడలో బ్యానర్లు
వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా హనుమంతరావుకి గుర్తింపు
విజయవాడ : గుడివాడ వైసీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానికి కాకుండా మండవ హనుమంతరావుకు ఇస్తున్నారనే ప్రచారం అక్కడ జరుగుతోంది. అంతేకాదు, హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ గుడివాడలోని ప్రధాన కూడళ్లలో బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇదే విషయం వాట్సాప్ లో కూడా విపరీతంగా షేర్ అవుతోంది. మండవ హనుమంతరావు ప్రస్తుతం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. హనుమంతరావుకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. మనుమంతరావుకు మద్దతుగా, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటైన బ్యానర్లతో గుడివాడ వైసీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది.