వెంకటగిరి నియోజవర్గంలోని సైదాపురం మండలంలో యల్లసిరి గోపాల్ రెడ్డి గారి మామిడి తోటలో సైదాపురం మండలం వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు విస్తృతస్థాయి సమావేశమును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా.. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త, గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు, యల్లసిరి గోపాల్ రెడ్డి గారి లు పాల్గొన్నారు.*
ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ…
*తన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తోటలో సమావేశంను ఏర్పాటు చేసినమని ఎందుకంటే జనార్ధన్ రెడ్డి గారికి పచ్చదనం అంటే చాలా ఇష్టమని చెప్పినారు.తన తల్లిదండ్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజ్యలక్ష్మిమ్మ గారు బాటలోనే వెంకటగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పినారు. వైఎస్ఆర్సిపి కి జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గలో మెజార్టీ సాధించడానికి అందరం కలిసి పనిచేద్దామని చెప్పినారు. మా తల్లిదండ్రులు జనార్దన్ రెడ్డి గారి రాజలక్ష్మిమ్మ గారి ఎలక్షన్ లో కూడా పనిచేసిన అనుభవం నాకు ఉందని చెప్పినారు . నాన్నగారి తర్వాత నాలో వున్నా సామర్థ్యమును గుర్తించిన వారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని గర్వముగా చెప్పగలనని చెప్పినారు. ఏ పని చెప్పిన నిబంధితతో చేయడం అనేది నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అని చెప్పినారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్పిన నిబంధనతో చేసినను కాబట్టి అది గుర్తించి కొత్త బోర్డు ను సృష్టించి దానికి క్యాబినెట్ హోదా ఇచ్చి నన్ను చైర్మన్ చేసినారని చెప్పినారు. 40 సంవత్సరాల క్రితమే బాలాజీ జిల్లా అనేది నాన్నగారు కలని చెప్పినారు. ఇప్పుడు తిరుపతి జిల్లాగా ఏర్పడి తర్వాత మొదటగా నన్ను తిరుపతి జిల్లా అధ్యక్షులుగా చేసినందుకు గాను నాకు ఎంతో ఆనందంగా ఉందని దీని కొరకై జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇచ్చినాను అని తిరుపతి జిల్లాలోని 7 నియోజవర్గాల్లో వైయస్సార్సీపి గెలిపించి కానుక ఇస్తానని చెప్పినానని చెప్పినారు. వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా రాకముందు చాలామంది అభిమానులు రాజకీయంగా మీరు చాలా దూరంగా ఉన్నారని అందువలన రాజకీయం చేయడం కష్టంగా ఉంటుందని చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీతో బాగుంటారు కాబట్టి ఏదైనా తేలికైన నామినేట్ పదవులు తీసుకోమన్నారు చెప్పినారు. కానీ నేను ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినాను నా తల్లిదండ్రులు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు , రాజ్యలక్ష్మిమ్మ గారు ఈ వెంకటగిరి నుండే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినారని నేదురుమల్లి కుటుంబం ఎప్పుడు జనాభాలో ఉండి వారి ఆదరణ పొందుతూ ఉంటుందని అందుకనే నేను వెంకటగిరి నియోజవర్గం నుండి పోటీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినానని చెప్పినారు.
కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా….
నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నేదురుమల్లి భరోసా ఇచ్చారు. అనంతరం 31పంచాయతీల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశమై పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలను వివరించి వారి నుండి సలహాలు అడిగి తెలుసుకున్నారు..