రాష్ట్ర చరిత్రలో తొలిసారి లా నేస్తం
వైఎస్సార్ లానేస్తం కింద ఏకంగా రూ.50 కోట్ల ఆర్థిక సాయం
రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్టు
పేదోడి తరఫున న్యాయవాదులంతా నిలబడాలి
గుంటూరు పశ్చిమలో గెలుపే లక్ష్యం
పార్టీ విజయమే మనందరి కర్తవ్యం కావాలి
మనందరికీ గౌరవాన్ని ఇచ్చేది గెలుపే
గతంలో జరిగిన తప్పిదాలకు తావీయొద్దు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం లీగల్ విభాగమే : లేళ్ల అప్పిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లీగల్ సెల్‌తో ప్రత్యేక సమావేశం
గుంటూరు : లాయర్లకు జగనన్న ప్రభుత్వం పూర్తి అండగా ఉంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. స్థానిక చంద్రమౌళి నగర్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ లీగల్ సెల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ దేశ చరిత్రలో లాయర్ల కోసం లానేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏకంగా 50 కోట్ల రూపాయలను లా నేస్తం కింద యువ లాయర్ల తమ ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు. ఏకంగా రూ.100 కోట్ల నిధులతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును మన ప్రభుత్వం ఏర్పాటుచేసిందని తెలిపారు. ఇంతలా లాయర్లకు అండగా నిలబడిన జగనన్నకు మనమంతా తిరిగి అదే స్థాయిలో మేలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైఎస్ జగనన్నను గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. పేదోడి తరఫున లాయర్లంతా చిత్తశుద్ధితో పోరాడినప్పుడే జగనన్న చేస్తున్న సాయానికి సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చెప్పారు.
గెలుపే లక్ష్యంగా ముందుకెళదాం : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మనమంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశౄఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మోసం చేయడం తమకు చేతకాదని చెప్పారు. ఉన్నది ఉన్నట్లుగా తాను వ్యవహరిస్తానని పేర్కొన్నారు. వరుసగా రెండు సార్లు మనం పశ్చిమ నియోజకవర్గంలో గెలవలేకపోయామని తెలిపారు. అందుకు కారణాలు ఏమైనా గాని, వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎలాంటి తప్పులు జరగకుండా ముందుకు సాగాల్సిన అవసరం మనందరిపై ఉందని పేర్కొన్నారు. వార్డుల వారీగా పూర్తి స్థాయిలో పనిచేయాల్సి న అవసరం ఉందన్నారు. పశ్చిమలో పార్టీ గెలుపు కోసం ఏందాకైకా కష్టపడి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ప్రజల అండదండలు మనకే ఉన్నాయని, ఉత్సాహంగా ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ విభాగం ఎంతో బలమని చెప్పారు. పార్టీకి పూర్తి స్థాయిలో అండగా నిలబడుతూ లీగల్ విభాగం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, కె.రామకృష్ణారెడ్డి, లీగల్ సెల్ నాయకులు సయ్యద్‌బాబు, అబ్రహం లింకన్, పోకల వెంకటేశ్వర్లు, బార్ కౌన్సిల్ సభ్యులు రోళ్ల మాధవి, బి.బ్రహ్మారెడ్డి, క్రాంతి అనిల్, మొండితోక శ్రీనివాసరావు, ఎంవీ సుబ్బారెడ్డి, శ్యామల సుధాకర్‌రెడ్డి, మంజుల, ఝాన్సి, రత్నకుమారి, రేవతి, బాలా త్రిపురసుందరి, ఇందిర, సోని, లీగల్ సెల్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.