ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు
ఒంగోలు : రాప్తాడులో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సభలో జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అక్కడి నాయకులు కార్యకర్తలు దాడి చేశారని ఈ దాడిని ఫెడరేషన్ పూర్తిగా ఖండిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఒంగోలులో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై అనేక దాడులు భౌతికంగా నైతికంగా వ్యక్తిగతంగా జరుగుతున్నాయని జర్నలిస్టులు నాలుగో స్తంభం అయినా అలాంటి నాలుగో స్తంభాన్ని తుడిచివేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఒకే స్థంభం పై నడిచేందుకు ప్రయత్నిస్తుందని ఇలాంటి దాడులను జర్నలిస్టులు సహించబొరని ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్తామని ధర్నాలో పాల్గొని ఆయన అన్నారు. రాష్ట్రంలో అనేకమందికి జర్నలిస్టులకు ప్రభుత్వం జారీ చేసే కార్డులు ఇవ్వక, ఇచ్చిన వాటికి స్థలాలు ఇస్తామన్నారని, వాటికి నేటికీ కూడా ఆలుచూలు లేదన్నారు. మాకు వద్దు స్థలాలు.. ఇలాంటి దాడులు మాకొద్దు అని అన్నారు. ఇలాంటి దాడులు ఇలాగే కొనసాగితే పెన్ డౌన్ కార్యక్రమానికి కూడా వెనుకాడబోమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని జర్నలిస్టు సంఘాలు స్థానిక నాయకులు స్థానిక ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ,స్థానిక పత్రిక ఎడిటర్లు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు.