రాష్ట్రస్థాయి జర్నలిస్ట్ క్రికెట్ జర్నలిస్టుల ఐక్యతకు దోహదపడుతుంది.
రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్ పోస్టర్ ను ఆవిష్కరించిన వై శ్రీలక్ష్మి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పురపాలక శాఖ.
అనంతలో జరిగే రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్లో వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొని ఐకమత్యంతో ముందుకెళ్లాలని వై శ్రీలక్ష్మి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పురపాలక శాఖ అన్నారు
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురంలో ఈనెల 26వ తేదీ నుంచి జరిగే రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించన పోస్టర్లను వై శ్రీలక్ష్మి ఆవిష్కరించారు
విజయవాడ నగరంలోని సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం ఉదయం రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లను వై శ్రీలక్ష్మి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి తో కలిసిఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి నగేష్ ,డి రాజగోపాల్ , అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ తిరుపతి జిల్లా నాయకుడు వెంకటేష్ ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా వై శ్రీలక్ష్మి మాట్లాడుతూ అనంతపురంలో రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఇందుకోసం కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ని అభినందిస్తున్నానని మచ్చ రామలింగారెడ్డి జర్నలిస్టుల కోసం ఏర్పాటుచేసిన ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని వై శ్రీలక్ష్మి ఆకాంక్షించారు
నిత్యం పని ఒత్తిడితో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ టోర్నమెంట్ నిర్వహించడం ఒక రికార్డ్ఇందులో వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ టోర్నీ జర్నలిస్టుల ఆటవిడుపుకి కూడా ఉపయోగపడుతుందని వై శ్రీ లక్ష్మీ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆశాభావం వ్యక్తం చేశారు