బాలయ్య పల్లి వెంకటగిరి ఎక్స్ప్రెస్ :-
రైతులు ఆరు కాలం కష్టించి పండిస్తున్న పంటకు సాగునీరు కొరత రావడంతో బంగారం పేట నుంచి వస్తున్న తెలుగంగ ప్రధాన కాలువకు 10 గ్రామాలకు సంబంధించిన రైతులు కయ్యూరు చెరువు సప్లై కాలవకు నీళ్లు వదులుకున్నారు దీంతో తెలుగు గంగా అధికారులు రైతులు వేసిన పైపులైన్లను పగలగొట్టి రైతులు పై కేసులు పెట్టటం అని బెదిరించడంతో రైతులు వాగ్వివాదానికి అధికారులతో దిగడం జరిగింది. బాలాయపల్లి మండలం అక్కంపేట, వెంగమాంబ పురం, కయ్యూరు,వేణుగోపాల్ పురం, బాలాయపల్లి, వెంకటగిరి రూరల్ మండలం అగ్రహారం కందనాలపాడు, అమ్మపాలెం, తదితర గ్రామాలు ఒక చెందిన రైతులు దామాసాలు వేసుకొని తెలుగు గంగ కాలవనించి పైపులైను ఏర్పాటు చేసుకొని కయ్యూరు చెరువు సప్లై ఛానల్ కాలువకు నీళ్లు వదులుకుంటే గంగ అధికారులు ఆ పైపులైన్లను పగలగొట్టడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేతికి వచ్చే పంట ఎండిపోతుంది:-
అప్పులు చేసి ఆరుకాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నీటి కొరత ఏర్పడి ఆ పంట దిగుబడి రాదని భయంతో చేతికి అందిన కడకల్లాపులు చేసి సాగునీటి కోసం వెతల పడుతున్నామని రైతులు ఆవేదన చెందారు. తెలుగు గంగ కాలవకు వస్తున్న నీటిని కొంతమేరకైనా వదులుకొని ఆ పంటలను కాపాడుకోవాలని పైపులైను ఏర్పాటు చేసుకొని నీళ్లు వదులుకుంటే గంగాధికారులు వచ్చి ఆ పైపులైన్లు పగలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు
ఫోటో:- పైపులైన్లు పగలగొట్టిన దృశ్యం