పేద కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం పెళ్లి కానుక
కల్యాణమస్తు, షాదీ తోఫా రూ. 78.52 కోట్ల నిధులను విడుదల చేసిన జగన్ మోహన్ రెడ్డి
చదువును ప్రోత్సహించే క్రమంలో వరుడు, వధువు ఇద్దరూ పదో తరగతి చదివి ఉండాలనే నిబంధన పెట్టామన్న జగన్
గుంటూరు : వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఐదో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయం చేశారు. వధువుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేశా పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని, అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. మంగళవారం వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో ఆయన జమ చేశారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతోంది. వైఎస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికీ పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ కచ్చితంగా పదో తరగతి సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలని పెట్టాం. దీని వల్ల కచ్చితంగా ఈ స్కీమ్‌లో ఎలిజబులిటీ రావాలంటే కచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుంది. 18 సంవత్సరాలు వధువుకు, 21 సంవత్సరాలు వరుడికి ఉండాలన్న నిబంధన ఉండటం వల్ల పదో తరగతి ముందే 15 ఏళ్లు, 16 సంవత్సరాలకే అయిపోయినా 18 సంవత్సరాల ముందే పెళ్లి జరిగితే ఈ స్కీమ్ కు అనర్హులు కాబట్టి, ఇంటర్ మీడియట్‌కు పంపితే అమ్మ ఒడి అనే పథకం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం తల్లికి అమ్మ ఒడి ద్వారా మంచి జరుగుతుంది. కచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ ఇచ్చే విద్యాదీవెన ఉంది. అదేమాదిరిగా వసతి దీవెన కూడా బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్‌లో ఇస్తున్నాం. ఈ రెండు స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాపా, ప్రతి పిల్లాడూ గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నామన్నారు.
ఖకచ్చితంగా తల్లి చదివి ఉంటే వచ్చే జనరేషన్ లో పిల్లలు కూడా చదువుల బాట పడతారు. మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే, అదొక ఆస్తిగా మనకు వస్తే, మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. గతంలో 40 వేలకు పరిమితమైన ఎస్సీలకు రూ.లక్ష దాకా తీసుకుపోయాం. కులాంతర వివాహంఅయితే రూ.1.20 లక్షల వరకు తీసుకుపోయాం.ఎస్టీలకు రూ.50 వేలకు పరిమితమైతే రూ.లక్ష దాకా తీసుకుపోయాం. కులాంతర వివాహం అయితే రూ.1.20 లక్షల దాకా తీసుకుపోయాం. గతంలో బీసీలకు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తుంటే దాన్ని రూ.50 వేల వరకు తీసుకుని పోవడం, కులాంతర వివాహం అయితే దాన్ని రూ.75 వేల దాకా తీసుకుపోయాం. దివ్యాంగులకు ఏకంగా రూ.1.50 లక్షల దాకా తీసుకుపోయాం. వాళ్ల కుటుంబాల్లో ఏ ఒక్కరూ, తల్లిదండ్రులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదని సబ్‌స్టాన్సియల్ అమౌంట్ పెంచి ఇస్తున్నామన్నారు.
చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను అడుగులు వేయిస్తాయన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గతంలో అరకొరగా ఇస్తున్న పరిస్థితులు. దాదాపు 17,709 మంది పిల్లలకు ఇచ్చే అరకొర కూడా దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఏ ఒక్కరూ మిస్ కాకూడదని ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా ఇది 5వ విడత. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్‌కు సంబంధించినది ఈరోజు ఇస్తున్నాం. దాదాపు రూ.78 కోట్లు ఇస్తున్నాం. ఇంత వరకు 56,194 జంటలకు మంచి జరిగింది. వారి కుటుంబాలకు, తల్లిదండ్రులకు మంచి జరిగి రూ.427 కోట్లు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులు ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తున్నాం. దీని వల్ల అందరికీ మంచి జరగాలని, ఈ క్వార్టర్ లో ఏకమైన ఈ పిల్లలకు, తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్లందరికీ ఇంకా మంచి జరగాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా ఇంకా మంచి జరగాలని, మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.
సామాజిక విప్లవానికి నాంది : సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం మన రాష్ట్రంలో గొప్ప ప్రెస్టీజియస్ పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో గౌరవ ప్రదంగా వివాహం నిర్వహించుకునేలా ఏర్పాటుచేసిన కార్యక్రమం, ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికీ కళ్ళులేని కబోదుల్లా కళ్యాణమస్తు తీసేశారంటున్నారు, వారికి చెంపపెట్టు ఈ కార్యక్రమం, ఈ మధ్య బెంగళూరులో సామాజిక న్యాయంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది, ఈ కళ్యాణమస్తు కూడా చదువుకు లింక్ అయింది, అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని చెప్పడంతో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని పొగిడారు, సీఎంగా మీరు చేస్తున్న ఈ గొప్ప విప్లవం సామాజిక విప్లవానికి తెరతీసింది, ఏపీ ప్రజానీకం దీనిని గమనించాలని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.