బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
చదువు సమాజంలో ఉన్నత స్థానం కల్పిస్తుందని
వెంగమాంబ పురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్ గోపాల్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెంగమాంబ పురం ప్రభుత్వ జూని యర్ కళాశాలలో సరస్వతి పూజ కార్య క్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు మీ గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. ఎప్పు డైతే క్రమశిక్షణతో ఉంటామో ఐప్పుడే చదువు వస్తుందని తెలిపారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్షలు అయిన వెంటనే ఎంసెట్ కు ప్రిపేర్ కావాలని తెలిపారు. అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- మాట్లాడుతున్న దృశ్యం