వెంకటగిరి వైసీపీ అభ్యర్థి ని నేనే….
సీఎం ప్రకటించే 175 స్థానాల్లో నా పేరు ఉంటుంది.
నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడి.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
వాలంటీర్ లందరు సేవా వజ్రాలేనని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గం సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్పారు. కలువాయి లో వాలంటీర్ లకు వందనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆయన పాల్గొని వాలంటీర్ లకు సేవా పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేసిన ఆయన ను నాయకులు, కార్యకర్తలు పుష్ప గుచ్చాలను అందజేసి సత్కరించారు. ఈ అనంతరం నేదురుమల్లి మాట్లాడుతూ… నా ద్రుష్టి లో వాలంటీర్ లందరు సేవా వజ్రాలేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి అభ్యర్థి ని నేనే నని ఆయన ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసే అభ్యర్థులు జాబితా లో నా పేరు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్బంగా మండలం లో 5 మందికి సేవా రత్న,260 మంది కి సేవా మిత్ర పురస్కారాలను అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవలు చేసిన వాలంటీర్ లకు సేవా వజ్రాలకు 45 వేలు,సేవా రత్న లకు 30 వేలు, మిత్ర లకు 15 వారివారి అకౌంట్ లకు జమ చేస్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో పార్టీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి, జడ్పీటీసీ అనీల్ కుమార్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మి దేవి, ఎంపీటీసీ, సర్పంచ్ లు, వాలంటీర్ లు, అధికారులు పాల్గొన్నారు.
……….