బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
తల్లిదండ్రులు పిల్లలపై వ్యక్తిగత సరిగ్గా పెడితే ఉన్నత సదులు చదువుతారని బాలాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సరస్వతి పూజ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రులు 75% పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టా లని కోరారు. విద్యార్థులు వరుసగా మూడు రోజులుపాఠశాలకు రాకపోతే వాళ్ళ పేరు ఆన్లైన్లో తొలగించబడు తుందని తెలియజేశారు. ఇక బడి బయట పిల్లలను పాఠశాలలకు పంపించేలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి తల్లిదండ్రులను కోరారు. ఇక సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తేవాలని కోరారు.మండలం ఫస్ట్ వచ్చేలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని కోరారు. అనంతరం విద్యార్థులు సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు విద్యార్థులు తండ్రులు పదో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.
ఫోటో:- సంస్కృత కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు
పోటో:- సరస్వతి పూజ చేసిన దృశ్యం