వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
గురువారం నాడు వెంకటగిరి పట్టణంలోని ఎన్జీవో కాలనీలో వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాల రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయు) ప్రాంతీయ సమావేశం నిర్వహించారు.సదరు సమావేశంలో ఇటీవల తిరుపతిలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన గూడూర్ డివిజన్ నాయకులు రాష్ట్ర కౌన్సిలర్ తాళ్ళూరు శ్రీనివాసులు నాయుడు, జిల్లా అధ్యక్షులు కొండూరు రమేష్ బాబు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బొడిచెర్ల.కోటేశ్వర రావు, జిల్లా అధనపు ప్రధాన కార్యదర్శి
.రత్నయ్య,జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి సునీత, జిల్లా కార్యదర్శి చీమల కృష్ణయ్య, జిల్లా మైనారిటీ కన్వీనర్ మహమ్మద్ మీర్జా గయాజుద్దీన్, గూడూరు డివిజన్ కన్వీనర్ చెంచురత్నయ్య తదితర నాయకులను ఘన సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్టీయూ తిరుపతి జిల్లా అధ్యక్షులు కొండూరు రమేష్ బాబు గారు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం ఏర్పడి ఈనాడు ఉపాధ్యాయుల అనుభవిస్తున్న అనేక సౌకర్యాలను కల్పించడంలో ఎస్టియు ప్రముఖ పాత్ర వహించిందని అలాంటి సంఘానికి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికావటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా గూడూరు డివిజన్లో ఎస్టీయూ సంఘాన్ని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేశారు.