కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ సౌత్ వన్ రీజినల్ హెడ్ మహమ్మద్ జమీర్
విజయవాడ : పర్యావరణరహిత వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ సౌత్ వన్ రీజినల్ హెడ్ మహమ్మద్ జమీర్ అన్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని విజయదుర్గ కైనెటిక్ షో రూమ్ లో కైనెటిక్ ఈ లూనా(ఎలక్ట్రిక్ వాహనం) అమ్మకాలను కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ సౌత్ వన్ రీజినల్ హెడ్ మహమ్మద్ జమీర్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం అధినేత చల్లగుండ్ల రాంబాబు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ ఈ లునా వాహనాలకు సంబంధించి తాము ఎన్టీఆర్ జిల్లా డీలర్ షిప్ ని తీసుకున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ధరల్లో కైనటిక్ ఈ లూనా అమ్మకాలను తమ షోరూంలో ప్రారంభించినట్లు చెప్పారు. అందరికీ అందుబాటు ధరల్లో ఉండే ఈ లూనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఎటువంటి కాలుష్యానికి తావులేని విధంగా పర్యావరణహితంగా ఈ లూనా నడుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కైనటిక్ గ్రీన్ ఎనర్జీ ఏపీ సీనియర్ మేనేజర్ మగేశ్, ఏపీ సర్వీస్ ఎ ఎస్ ఎం సికిందర్, పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.