డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి :22
డక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో గురువారం మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ వైఎస్ఆర్సిపి నాయకులను ఆత్మీయంగా పలకరించే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు మస్తాన్ నాయుడు, మీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. మీరయ్య ,కృష్ణయ్య ల తండ్రి కోలా రామయ్య ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఆరోగ్య యోగక్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామంలోని మహిళలతో మమేకమై గ్రామంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నేదురుమల్లి రాజ్యలక్ష్మిమ్మ హయాంలో దూరదృష్టితో గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆమెకు తెలిపారు . గ్రామంలో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ సిసి రోడ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించిన వైనం ను మాజీ మంత్రికి వివరించి కృతజ్ఞతలు తెలిపారు
రామ్ కుమార్ రెడ్డికి అండగా నిలవాలి…
తన భర్త నేదురుమల్లి జనార్దన్ రెడ్డి , తనకు అండగా ఉన్న దగ్గవోలు గ్రామస్తులు ఈ దఫా ఎన్నికల్లో నా కుమారుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు నేదురుమల్లి కుటుంబం దగ్గవోలు అభివృద్ధికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో మండల జెసిఎస్ కన్వీనర్ చింతల శ్రీనివాసులు రెడ్డి, వైకాపా మండల పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి,స్థానిక నాయకులు మస్తాన్ నాయుడు, మీరయ్య, కృష్ణయ్య ,రామస్వామి నాయుడు ,మాజీ సర్పంచ్ పాడి కృష్ణయ్య ,ఎంపిటిసి పరుశురామయ్య హరిబాబు ,దేవలపల్లి మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి ,సొసైటీ అధ్యక్షులు పి దశరథరామిరెడ్డి , ఎన్. వేణు గోపాల్ నాయుడు ఘట్టమనేని శ్రీనివాసులు, కోళ్ల పూడి వేణు ,బండి రమేష్ రెడ్డి, మార్లగుంట మజ్జిగ శ్రీనివాసులు , శ్రీహరికోట కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు