‘ది డైలీ షో’కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న దక్షిణాఫ్రికా హాస్య నటుడు ట్రెవర్ నోహ్ ఏడేళ్ల తర్వాత ఆ షోకు వీడ్కోలు పలకనున్నాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పలు విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో అతను మొదటిసారిగా భారతదేశంలో పర్యటనను గుర్తు చేసుకున్నాడు. భారతీయ ప్రజల మద్దతు, ప్రేమను ఎప్పటికీ మరచిపోలేనని అన్నాడు. తనపై ఇండియన్స్ చాలా ప్రేమ, గౌరవం కనబరిచారన్నాడు. “మేము మొదటగా టీవీ షో ప్రారంభించినప్పుడు, చాలా మంది వ్యక్తులు స్పష్టంగా మాపై విశ్వాసం కలిగి లేరు. తర్వాత ఈ షో అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారతదేశంలో ఎంతో మంచి ఆదరణ పొందింది..నేను చాలా కాలం క్రితం భారతదేశాన్ని మొదటిసారి సందర్శించినప్పుడు ఆ దేశ ప్రజలు ఉత్సాహంగా ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ యాత్రకు గాఢమైన కృతజ్ఞతా భావం నన్ను ముంచెత్తింది. ఇవన్నీ నమ్మశక్యం కానివి. నేను దీన్ని ఖచ్చితంగా ఊహించలేదు.” అంటూ ట్వీట్ చేశాడు.