ప్రపంచంలోనే అతి చిన్న గుండె పంపు ఇంపెల్లా పరికరం సహాయంతో మహిళకు వివేకా హాస్పిటల్‌లోని వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. వైద్యులు మధుమేహం, థైరాయిడ్ వ్యాధి, అధిక రక్తపోటు, డయాబెటిక్ పాలీన్యూరోపతి, అనేక కోమోర్బిడిటీలతో బాధపడుతున్న 62 ఏళ్ల మహిళకు ప్రపంచంలోనే అతి చిన్న గుండె సెంట్, ఇంపెల్లా డివైస్‌ను ఉపయోగించడంతో వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. అధిక-రిస్క్ ప్రొటెక్టెడ్ యాంజియోప్లాస్టీ ద్వారా ఆమె గుండెలో మూడు స్టెంట్లు వేశారు. అత్యంత అధునాతన పరికరాన్ని నగరంలో విజయవంతంగా ఉపయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.