జాన్వీ కపూర్ నటించిన మిలీ సినిమా శుక్రవారం విడుదలైంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం చతికిలపడింది. ఈ చిత్రం ఉత్తమ రివ్యూలను సాధించినప్పటికీ ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమవుతోంది. సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మిలీ సినిమా పెద్దగా ఆడలేదు. మొదటి మూడు రోజులు కేవలం రూ. 1.77 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే ఇండియా టుడే నివేదించిన ప్రకారం… ఈ చిత్రం థియేటర్లలో నాల్గవ రోజు రూ. 30-35 లక్షలు వసూలు చేసి మొత్తం రూ.2 కోట్లకు పైగా వసూలు చేసింది. కత్రినా కైఫ్ నటించిన ఫోన్ భూత్, సోనాక్షి సిన్హా, హుమా ఖురేషి నటించిన డబుల్ ఎక్స్ఎల్ విడుదలైన రోజునే జాన్వీ కపూర్ సినిమా కూడా విడుదల కావడం పెద్ద మైనస్.