సమంత ప్రస్తుతం తనకు బాగా లేకపోయినా కూడా యశోద సినిమా కోసం బయటకు వచ్చింది. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. యాంకర్‌గా సుమ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలు చెప్పింది. కొన్ని సమాధానాలు సమంత చెబుతూ ఉంటే.. అందరి కంట్లో నీళ్లు తిరగాల్సిందే. తాను ఎదుర్కొన్న పరిస్థితులు, అనారోగ్యానికి గురవ్వడం, ఒక్కోసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితి అంటూ ఏడుస్తూ సమంత చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి. యశోద సినిమా కోసం ఎంతలా కష్టపడిందో ఇది వరకు చెప్పేశారు హీరో, నిర్మాత. సమంత బెడ్డు మీద సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పిందట. ఈ విషయాన్ని నిర్మాత బయటకు చెప్పేశాడు. ఇక ఇప్పుడు సమంత ఈ సినిమా సమయంలో జరిగిన ఘటనల గురించి చెప్పింది. సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాను కాబట్టే ఇలా టెన్షన్ పడుతున్నాను.. కానీ ఎక్కువ టెన్షన్ పడకూడదని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అని సమంత చెప్పుకొచ్చింది.