బాలీవుడ్ స్టార్ దంపతులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ లకు పాప జన్మించిన క్రమంలో కేఆర్కే శుభాకాంక్షలు తెలియజేసిన తీరు వివాదాస్పదంగా మారింది. గత వారం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్న రణ్‌బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేశారు. పాపకు జన్మనివ్వడంతో కపూర్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. మరోవైపు దేశవ్యాప్తంగా సినీ వర్గాలు ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ, వివాదస్పద రివ్యూలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ కేఆర్కే అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కానీ, ఎప్పటిలాగే వివాదస్పద రీతిలో ట్వీట్ చేశారు. పెళ్లయిన ఏడు నెలలకే తల్లిదండ్రులైనందుకు అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌కు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.