గత వారం విడుదలైన హాలీవుడ్ సినిమా బ్లాక్ పాంథర్ ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. నిజానికి దాని కథానాయకుడు చాడ్విక్ బోస్మాన్ గతేడాది పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన చివరగా నటించిన బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్లో అలరించాడు. బోస్మాన్ మరణించే సమయానికి, చిత్రం అప్పటికే ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభ దశలో నెలరోజుల పాటు చిత్రీకరణకు సిద్ధమైంది. తర్వాత చిత్ర యూనిట్ కాస్త సమయం తీసుకుని సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయగలిగింది.చాడ్విక్ బోస్మాన్ మరణించినప్పుడు దర్శకుడు ర్యాన్ కూగ్లర్ దాదాపు ఒక సంవత్సరం పాటు సీక్వెల్‌ను సిద్ధం చేసుకోవడం విశేషం.