హైదరాబాద్ : గ్రామీణ భారతం మాంధ్యం కోరల్లో చిక్కుకుంది. గ్రామస్తుల కొనుగోలు శక్తి రోజురోజకీ పడిపోతోంది. వరసగా నెలల తరబడి ఈ పరిస్థితి కొనసాగుతుండటం ఆందోళన కరంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ గ్రామీణుల కొనుగోలు శక్తి పెరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేగంగా అమ్ముడుబోయే వస్తువులు (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ – ఎఫ్ఎంసిజి) మార్కెట్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రంగానే ఉందని నీల్సన్ ఐక్యూ తాజా అధ్యయనంలో తేలింది. సబ్బులు, షాంపులు, బిస్కట్లు, కూకీస్, నోట్‌బుక్, చాక్లేట్లు, పాల ఉత్పత్తులు, ఫెయిర్‌నెస్ క్రీములు వంటి వస్తువులకు మార్కెట్లో భారీ డిమాండ్ వుండే విషయం తెలిసిందే. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ వస్తువుల వినిమయం 3.6 శాతం పడిపోయింది. ఇది గత త్రైమాసినికనాు అధికం. జూన్ త్రైమాసికంలో అంతకుముందుతో పోలిస్తే ఈ తరహా వస్తువుల వినిమయం గ్రామీణ ప్రాంతాల్లో 2.4 శాతం క్షీణించిందనితేల్చారు. తాజా అధ్యయనంలో అంతకన్నా తక్కువకు విక్రయాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కొంతమేర పెరుగుదల నమోదైనప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గడంతో మొత్తంమీద ఎప్ఎంసిజి రంగంలో వ్యతిరేక ఫలితాలు వ్యక్తమయ్యాయి. నీల్సన్ ఐక్యూ రిపోర్టు ప్రకారం జులైా సెప్టెంబర్ కాలంలో పట్టణ మార్కెట్లలో ఎఫ్ఎంసిజి ఉత్పత్తుల వినిమయం 1.2 శాతం పెరిగింది. ఇంతక్రితం త్రైమాసికంలో ఇది 0.6 శాతంగా నమోదయ్యింది. స్థూలంగా దేశంలో ఎఫ్ఎంసిజి రంగం అమ్మకాలు 0.9 శాతం క్షీణించాయి.
ఎందుకీ స్థితి
దేశంలో ద్రవ్యోల్భణం భారీగా పెరగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ ఆచరణలో ద్రవ్యోల్భణం అదుపుకావడం లేదు. దీంతో ఆహారపదార్ధాల ధరలే చుక్కలు దాటుతున్నాయి. కూరగాయల ధరలుకూడా పైపైకే ఎగబాకుతున్నాయి. మారిన ఆర్థిక వ్యవస్థల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆహార పదార్ధాలతో పాటు కూరగాయాలు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితే ఏర్పడింది. అదే సమయంలో నిజవేతనాలు దారుణంగా పడిపోయాయి. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి అంతంతమాత్రంగానే ఉండటంతో, గ్రామాలపైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తిండి గింజలకు ఖర్చు చేయడమే కష్టంగా మారుతోంది. ఫలితంగా ఇతర వస్తువుల వినియోగాన్ని సాధ్యమైనంత మేర తగ్గించుకుంటునాురు.
ప్రమాద ఘంటిక : నీల్సన్ ఐక్యూ
ఈ పరిస్థితిని ప్రమాద ఘంటికగా నీల్సన్ ఐక్యూ పేర్కొంది. ఆ సంస్థ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ సతీష్ పిల్లయి ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకును మందగమనం, నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్భణం ఈ పరిస్థితికి కారణంగా పేర్కొన్నారు.
‘అమ్మకాలు తగ్గడంతో సాంప్రదాయ వర్తక రిటైలర్లు తక్కువ స్టాక్లను పెట్టుకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తయారీదారులు రిటైల్ వర్తకులకు మద్దతు ఇవ్వాలి. అని ఆయన సూచించారు.
చిన్న ప్యాక్‌లలోనే కొంటున్నారు
ధరలు అధికంగా ఉండటంతో భారీ పరిణామాల్లో కొనడానికి వినియోగదారులు సిద్ధపడటం లేదు. దీంతో వివిధ సంస్థలు తమj ఉత్పత్తులను చినుచిను ప్యాక్‌లలో అందిస్తున్నాయని,వాటికే డిమాండ్ ఉంటోందని సర్వేలో తేలింది. ఇటీవల కాలంలో అనేక సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి చిన్న ప్యాక్‌లను తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు సర్వే పేర్కొంది.