హాలీవుడ్ సినిమా బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్.. నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ముఖ్య నటుడు చాడ్విక్ బోస్మన్కు చిత్ర తారాగణం నివాళులర్పిస్తూ సినిమాను ఏకకాలంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. ఈ సినిమాలో విలన్లుగా టెనోచ్ హుర్టా, నామోర్, ఇతర ముఖ్య నటులు మాబెల్ కాడెనా, అలెక్స్ లివినల్లి, తాలోకాన్, మోరా, అట్టుమా తదితరులు నటించారు. కాగా, ఈ సినిమా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా శుక్రవారం విడుదలైంది. బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్.. స్టార్లు మాబెల్ కాడెనా, అలెక్స్ లివినల్లి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘స్కార్స్’ సన్నివేశాన్ని చిత్రీకరించిన తీరును వివరించారు. అప్పటి వారి అనుభవాలు, చాడ్విక్ బోస్మన్ తో ఉన్న సంబంధం గురించి వివరించారు.