విజయవాడ : ఏ రంగంలోనైనా ఆసక్తి ఉంటేనే రాణించగలమని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కళాశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. గన్నవరంలో తాను విద్యనభ్యసించిన వీకేఆర్ కళాశాలను సందర్శించి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. గతంలో అవకాశాలు తక్కువగా వుండేవని, ఎంతో కష్టపడి ఈ రంగంలో విశేష కృషి చేసి ఈ స్థాయికి చేరామని తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. కళాశాల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టులతో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పలు అంశాలపై చర్చించారు. జర్నలిజంలో వస్తున్న ఆధునిక పోకడలను అవగాహాన చేసుకుంటూ వృత్తిలో ముందుకు సాగాలని ఆకాంక్షిచారు. ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ ప్రజా ప్రయోజన పథకాల వివరాలను ప్రజలకు చేరవేయటంలో జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ముందుండాలని తెలిపారు.