రెవిన్యూ క్రీడా, సాంస్కృతిక ఉత్సవములు-2022 ప్రారంభం
విజయవాడ, సూర్య ప్రధాన ప్రతినిధి : ఆరవ రాష్ట్ర రెవిన్యూ క్రీడా, సాంస్కృతిక ఉత్సవములు-2022 ఆంద్రప్రదేశ్ రెవెన్యూ సెర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, , ప్రత్యేక ఆహ్వానితులుగా అంతర్జాతీయ షేటిల్ బ్యాట్మింటన్ క్రీడాకారిణి, ఒలంపియన్, డిప్యూటి కలక్టర్ పి.వి. సింధు, అతిధులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడలు, యువజన సేవల ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్, బాపట్ల జిల్లా కలక్టర్ విజయ కృష్ణన్, శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి, ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస రావు, ఏపీ జేఏసీ అమరావతి సెక్రెటరీ జెనెరల్ వై.వి. రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్ రెవెన్యూ సెర్వీసెస్ అసోసియేషన్రా ష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు మాట్లాడుతూ, 6వ రాష్ట్ర రెవిన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవములు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యునివర్సిటీ క్రీడా ప్రాంగణములో రెవిన్యూ క్రీడలు నిర్వహించుటకు అనుమతించి పూర్తి సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంతో ఒత్తిడి లో ఉన్న రెవిన్యూ ఉద్యోగులకు ఉపసమనం కొరకు, స్నేహ పూర్వక వాతావరణం పెంపొందించుటకు క్రీడలు ఎంతో దోహదపడతాయని, క్రీడలలో పాల్గొనే ఉద్యోగులకు ఐదు రోజులు ప్రత్యేక సెలవు దినాలు ప్రకటించి ప్రభుత్వము, అధికారులు పూర్తిగా సహకరించినందుకు, ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొని క్రీడలు, సాంస్కృతిక పోటిలలో ఉత్సాహముగా పాల్గొని గెలుపు ఓటమి లకు అతితముగా అన్ని జిల్లాలు స్నేహపుర్వకముగా మెలగాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి, మాకు మంచి వసతులు ఏర్పాటుచేసిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ , రిజిస్ట్రార్ కరుణకి ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడలు, యువజన సేవల ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి ఒత్తిడిని అదిగామించడానికి , ముందుగా ఆరోగ్యముతో ఉండాలని, రోజూ కనీసము 30 నిమిషముల పాటు తేలికపాటి వ్యాయామాలు చేయాలని, ఈ మూడు రోజులు క్రీడలలో పాల్గొనడమే కాకుండా ప్రతి రోజు మీకు ప్రావీణ్యం ఉన్న క్రీడలు ఆడడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని, ప్రతి ఒక్కరు ఏదో సమయములో కనీసము 30 నిమిషముల పాటు శారీరక శ్రమ చేయాలనీ కోరారు. శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2018 వ సంవత్సరములో కాకినాడలో జరిగిన రెవిన్యూ క్రీడలలో స్వయముగా పాల్గొన్నానని, ఉద్యోగుల్లా కాకుండా నిజమైన క్రీడకారులుగా, పూర్తి క్రీడా స్పూర్తితో రెవిన్యూ క్రీడలు ఎంతో ఉత్సాహముగా సాగుతాయని, ప్రతి మూడు సంవత్సరములకు ఒకసారి రెవిన్యూ క్రీడలు నిర్వహించడము అభినందనీయమన్నారు.
బాపట్ల జిల్లా కలక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ రెవిన్యూ శాఖ లేనిదే క్షేత్ర స్థాయిలో ఈ పని చేయలేమని, 24 గంటలు రెవిన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి ఉంటుందని, ప్రభుత్వ అనుమతితో , సీసీఎల్ ఏ అనుమతితో జరుగుచున్న ఈ క్రీడలలో ఉల్లాసముగా పాల్గొని ఒత్తిడిని జయించాలని అభిలాషించారు. అంతర్జాతీయ షేటిల్ బ్యాట్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడలిస్ట్ , డిప్యూటి కలక్టర్ . పి.వి. సింధు మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సర్వ సాధారణమని, ఒత్తిడిని జయించడానికి క్రీడలను సద్వినియోగము చేసుకోవాలని రెవిన్యూ శాఖ లో డిప్యూటి కలక్టర్ గా ఉన్నందుకు చాలా గర్వపడుతు న్నానని, రెవిన్యూ క్రీడలు సందర్భముగా రెవిన్యూ కుటుంబాన్ని అంతటిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
ముఖ్య అతిదిగా పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ తీవ్రమైన ఒత్తిడి తో అనుక్షణం పని లో నిమగ్నమయ్యే రెవిన్యూ ఉద్యోగికి 11 నుండి 13 వరకు రెవిన్యూ క్రీడలలో పాల్గొనడము, క్రీడలను క్రమము తప్పకుండా నిర్వహించడము అభినందనీయమని, ఉద్యోగులు మార్చ్ ఫాస్ట్ చేయుచున్న తీరు చూస్తుంటే పూర్తి స్థాయి క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేస్తున్నట్లుగా అద్భుతముగా ఉన్నదని క్రీడాకారులు కూడా ప్రొఫెషనల్స్ స్థాయి లోనే ఆడుతారని అర్ధమవుచున్నదని, గాయాల పాలు కాకుండా జిల్లాల మధ్య సంభందబాంధవ్యాలు చెడిపోకుండా చక్కటి క్రీడా స్పూర్తితో ఉల్లాసంగా ఉత్సాహముగా పాల్గొనాలని అభిలాషించారు. అలాగే ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో సర్వ సాధారణమని, దానిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ వివిధ మార్గాలను ఎంచుకోవాలని, అంతేగానీ ఒత్తిడి ఒత్తిడి అని పదే పదే అనుకుంటూ ఉంటే అదే ఒత్తిడిగా మారిపోతుందని, అందువల్ల మనం అనుకునే దాన్నిబట్టి ఉంటుందని తెలిపారు. ఈకార్యక్రమములో ఏపీ జేఏసీ అమరావతి సెక్రెటరీ జనరల్ వై వి రావు, అసోసియేట్ చైర్మన్ ఫణి పెర్రజు, కో చైర్మన్ అల్ఫ్రెడ్, గుంటూరు, కృష్ణా జిల్లాల ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్లు సంగీతరావు, ఈశ్వర్, సిటీ అధ్యక్షుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏ.పి.డెప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ధర్మ చంద్రా రెడ్డి, ఆంద్రప్రదేశ్ రెవెన్యూ సెర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి వీ వీ గిరి కుమార్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వీ రాజేష్ , రాష్ట్ర కార్యదర్శి మధురి, పెంచల రెడ్డి, కోనా ఆంజనేయ కుమార్ (చంటి), సాంబశివ రావు, పేరిపోగు ప్రసన్న, సుధాకర్ చౌదరి, అనుపమ, జయరాజు తదితరులు పాల్గొన్నారు.