బాలీవుడ్ నటి కృతి సనన్ ఇటీవల చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ బాలీవుడ్ సుందరి తన ఇటీవలి ఫోటో షూట్ మేకింగ్ వీడియోను అప్లోడ్ చేసింది. మనీష్ మల్హోత్రా డిజైనింగ్ శారీలో కృతి సనన్ హొయలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో పలు సినిమాల్లో నటించిన కృతి సనన్కు పెద్ద హిట్లు రాలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమెకు తిరుగులేకుండా పోయింది. తాజాగా నీలం రంగు శారీలో కృతి సనన్ అందాలు యువతను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇలా ఆమె తన ఫొటోలను షేర్ చేయగానే లైక్లు, కామెంట్లు, షేర్లతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలతో పాటు సంగీతాన్ని కూడా ఆమె ఆస్వాదించింది.
ప్రస్తుతం కృతి సనన్ .. ప్రభాస్ హీరోగా ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’లో సీతమ్మ పాత్రలో నటిస్తోంది.ఈ సినిమా ను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఈ సినిమా గ్రాఫిక్స్ పై విమర్శలు రావడంతో మార్పుచేర్పుల కోసం మరో ఆరు నెలలు వాయిదా వేశారు. ఈ చిత్రాన్ని 2023 జూన్ 16న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.