బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కజిన్ పష్మీనా రోషన్ గురువారంతో 27వ ఏట అడుగుపెట్టింది. శుక్రవారం ఆమె జన్మదిన వేడుకను డాక్యుమెంట్ చేస్తూ ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. ఈ వీడియోల్లో ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో డేటింగ్ చేస్తున్న సబా ఆజాద్ కూడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా పష్మీనా రోషన్ ఒక పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది, “పుట్టినరోజు శుభాకాంక్షలు పంపడానికి సమయాన్ని వెచ్చించిన ప్రతి ఒక్కరికీ, నా స్నేహితులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. మీలో ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో కూడిన వీడియోను షేర్ చేసింది.