దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు
అనుభవిస్తున్న వారిని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్న తమిళనాడు డీఎంకే
ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సంతప్తిగా ఉన్నట్లు లేదు. కాంగ్రెస్ పార్టీకి
ప్రధాన మిత్రపక్షంగా ఉన్న డీఎంకే ఇలా వ్యవహరించడాన్ని తమిళనాడు
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఉన్నాయి. రాజీవ్
హంతకుల విడుదల తీర్పును కాంగ్రెస్ తప్ప, మిగిలిన అన్ని పార్టీలు
స్వాగతించాయి. డీఎంకే అధికారంలో ఉన్నా, లేకున్నా వారి విడుదలకు
పార్లమెంటులోనూ, అసెంబ్లీ లోనూ గళమెత్తిందని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు.
నళిని ఉరిశిక్షను యావజ్జీవ కారాగారశిక్షగా తగ్గించింది తన తండ్రి కరుణానిధి
నేతృత్వం లోని ప్రభుత్వమేనని గుర్తుచేశారు. మిగిలిన పార్టీలు సైతం తీర్పును
స్వాగ తించాయి. కాంగ్రెస్, తమిళ మానిల్ కాంగ్రెస్ మాత్రం తీర్పును వ్యతిరేకిం
చాయి. దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసిన రాజీవ్ న్ను అమానుషంగా హతమార్చిన
వారిని విడుదల చేయడం సరి కాదని, నళిని బృందం విడు దల పట్ల కార్యకర్తలెవ్వరూ
వేడుకలు జరుపుకోరాదని సూచించాయి. వారి విడుదల ఆమోదయోగ్యం కాదని, అది పూర్తిగా
తప్పని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ల విభాగం ఇన్చార్జి జైరామ్
రమేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, వీరిని మానవతా కారణాలతో విడుదల చేశారని,
వారి విడుదలను వ్యతిరేకించేవారు భారత చట్టాలను గౌరవించాలని నళిని సోద రుడు
బకియనాథన్ కోరారు. ఓ ఆంగ్ల టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ ‘ఈ కేసులో మేం
పరిస్థితుల బాధితులం. ప్రాణాలు కోల్పోయినవారికి వ్యక్తి గతంగా క్షమాపణ
చెబుతున్నాం’ అని రాజీవ్ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి బకియనాథన్
పేర్కొన్నారు. తీర్పు పట్ల నళిని చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపారు.
సుప్రీంకోర్టుకు, భారత పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు.