జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
గుంటూరు : రాష్ట్రంలోని నిరుపేద రెడ్లను ఆదుకోవాలని అగ్రవర్ణ పేద
విద్యార్థులకు సుప్రీంకోర్టు ప్రకటించిన 10% రిజర్వేషను వెంటనే అమలు చేయాలని
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.
ఈనెల 12వ తేదీ శనివారం సాయంత్రం అరండల్ పేట 14 వ లైన్ లో రెడ్డి జేఏసీ రాష్ట్ర
కార్యాలయాన్ని ప్రారంభించి ప్రసంగించారు.ఈ సందర్భంగా వల్లంరెడ్డి
లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ సేవాతత్పరతతో న్యాయకత్వ లక్షణాలు ఉండి అందరినీ
కలుపుకొనేవారే రెడ్డి కులస్తులని వివరించారు.రెడ్డి కులంలో ఉన్న ప్రతిభ గల పేద
విద్యార్థులను ఆదుకోవడం అందరి కర్తవ్యంగా పేర్కొన్నారు. కర్ణాటక, ఉమ్మడి
మద్రాస్, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన
వారు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు.ఈ సందర్భంగా ప్రజా కవి యోగివేమన
చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 5,6 శతాబ్దాల క్రితమే
ప్రజలకు అర్థమయ్యే తెలుగు భాషలో సమాజ మార్పుకు తోడ్పడే పద్యాలు, గేయాలు
ప్రజలకు అందించిన ప్రజాకవి యోగివేమన అని కొనియాడారు. యోగి వేమన విగ్రహాన్ని
కొండవీటి కోటలో యోగివేమన మండపం వద్ద ప్రతిష్టించడం హర్షణీయమన్నారు. ఈ
కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి జేఏసీ గౌరవ అధ్యక్షులు పొలిమేర వెంకటరెడ్డి,
రాష్ట్ర రెడ్డి జేఏసీ అధ్యక్షులు వంగల వలివీరారెడ్డి, రాష్ట్ర మహిళా
అధ్యక్షురాలు కేతు సరోజా రెడ్డి, గుంటూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దూలం
మంజునాధ రెడ్డి, సెక్రటరీ బాణాల వెంకట శివారెడ్డి, పలనాడు జనరల్ సెక్రెటరీ
సైదారెడ్డి లు పాల్గొన్నారు.