విజయవాడ : దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నవభారత నిర్మాతగా నెహ్రూ వేసిన
పునాదులు. భారత్ ను ప్రపంచంలో గొప్ప దేశంగా నిలిపిందని ప్లానింగ్ బోర్డు వైస్
చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. జాతీయ బాలల
దినోత్సవాన్ని పురస్కరించుకుని 28వ డివిజన్ లక్ష్మీనగర్‌లోని జవహర్ లాల్ నెహ్రూ
విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ బాలల దినోత్సవ ప్రాముఖ్యతను
విద్యార్థులకు వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులన్న భారత మొదటి ప్రధాని
జవహర్ లాల్ నెహ్రూ జయంతిని ఏటా బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా
వస్తోందన్నారు. నెహ్రూ దేశానికి ఓ దశ, దిశను చూపారని కొనియాడారు. పిల్లలను
జాతి సంపదగా భావించి వారి బంగారు భవితవ్యానికి ఆయన నిరంతరం కృషి చేశారన్నారు.
చిన్నారులే దేశం యొక్క నిజమైన బలం, రేపటి సమాజానికి పునాదిగా ఆయన
అభివర్ణించారు. అటువంటి చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి ఒక్క చదువేనని,
కనుకనే చిన్నారుల భవిష్యత్తుని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని
వెల్లడించారు. భావిపౌరుల గురించి బాధ్యతగా ఆలోచిస్తూ జవహర్ లాల్ నెహ్రూ
కలలుగన్న సమాజ నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర
ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని వెల్లడించారు.
నెహ్రూ ఆశయాల సాధనకు, భావితరాలకు మంచి భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా
సమాజంలోని అన్ని వర్గాలు పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులకు
మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు కనపర్తి కొండా, వేదాంతం చైతన్య,
బెజ్జం రవి, పాండు, యర్రంశెట్టి శ్రీను, కమ్మిలి రత్న, కొల్లూరు రామకృష్ణ,
లంకా బాబు, గోపి, అభిరామ్, త్రినాథ్, శ్రీనివాస్, కోటిరెడ్డి, పార్టీ
శ్రేణులు, చిన్నారులు పాల్గొన్నారు.