నందమూరి బాలకృష్ణ సంతాపం
హైదరాబాద్ : నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు,
స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు.. ఘట్టమనేని కృష్ణ. తెలుగులో
కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి( సీక్రెట్ ఏజెంట్ ) సినిమాల్లో ఘనాపాఠి.
సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి.
వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ. ఆయనలేని లోటు తీర్చలేనిది.
సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. కృష్ణ కుటుంబ
సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని హిందూపూర్
శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.