చైల్డ్ పార్లమెంట్ సమావేశంలో ఏపీ సీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావు
విజయవాడ : బాలల హక్కుల పరిరక్షణ విద్యతోనే సాధ్యమని, ఆదిశగా ఏపీ ప్రభుత్వం
విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఏపీ సీఆర్
ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. నవంబర్ 20
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న
వారోత్సవాల్లో భాగంగా స్థానిక స్వర్ణ ప్యాలెస్ సమావేశ మందిరంలో అలయన్స్ ఫర్
చైల్డ్ రైట్స్ కన్వీనర్ రమేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి చైల్డ్
పార్లమెంట్ సమావేశానికి కొమ్మినేని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు దాటిన బాలల
హక్కుల రక్షణ ప్రాథమిక హక్కుగా చెప్పినప్పటికీ పిల్లల హక్కులు కాపాడడం అనేది
ఆచరణ సాధ్యం కాలేదన్నారు. బాలల హక్కుల పరిరక్షణ వారి పురోభివృద్ధి రక్షణ
విషయాలలో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలు అభినందనీయమన్నారు.
ఎక్కడైనా బాలల హక్కులకు భంగం వాటిల్లినట్లు తెలిస్తే ప్రభుత్వం దృష్టికి
తీసుకు రావాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ పురోభివృద్ధి విద్యతోనే
సాధ్యమన్నారు. బాలల హక్కుల పరిరక్షణ విషయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి
స్వచ్ఛంద సంస్థలు చైతన్య పరుస్తున్న తీరు అభినందనీయమన్నారు. ఏపీ స్టేట్ చైల్డ్
రైట్స్ ప్రొటెక్షన్ మిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ కేసలి అప్పారావు మాట్లాడుతూ
బాలల హక్కులకు ఎక్కడ భంగము వాటిల్లిన తమ దృష్టికి తేవాలన్నారు.
బాలల హక్కుల రక్షణ విషయంలో చట్టాలు పటిష్టంగా పనిచేస్తున్నాయన్నారు. ఆర్థిక
సామాజిక స్థితిగతులు బాలల హక్కులను హరిస్తున్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం
బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ద పెట్టి కార్యక్రమాలు అమలు
చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూనిసెఫ్ దక్షిణ భారత ప్రతినిధి ప్రసూమ్ సేన్
మాట్లాడుతూ ప్రపంచ బాలల హక్కుల వడంబడిక ప్రకారం బాలల హక్కుల రక్షణకు ప్రథమ
ప్రాధాన్యతనిస్తూ యూనిసెఫ్ విశేష కృషి చేస్తుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో
విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మ రాజు చలపతిరావు,ప్రెస్ అకాడమీ సెక్రటరీ
మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, ఎస్ ఐ ఈ ఎం ఏ టీ డైరెక్టర్ మస్తానయ్య,సి
డబ్ల్యూ సి కృష్ణా జిల్లా చైర్ పర్సన్ సువార్త, ఐసిడిఎస్ ప్రాజెక్ట్
డైరెక్టర్ ఉమాదేవి, మాధవ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తోలుత ఆలయన్స్
ఫర్ చైల్డ్ రైట్స్ స్టేట్ కోఆర్డినేటర్ కే. బాలచందర్ సభా కార్యక్రమ
పర్యవేక్షణ నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన చైల్డ్ పార్లమెంట్
కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన
విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యార్థిని,
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రెస్ అకాడమీ చైర్మన్ దృష్టికి
తీసుకువెళ్ళారు.