రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
మచిలీపట్నం : అర్హత కలిగిన ఏ ఒక్కరినీ వదలకుండా ఓటరుగా నమోదు చేయించాలని,
జనాభా, ఓటర్ల నిష్పత్తి పకడ్బందీగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల
అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల కమీషన్
ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించే ఓటర్ల ప్రత్యేక
సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్
కుమార్ మీనా బుధవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్
పి.రంజిత్ బాషాతో కలసి ఎన్నికల నమోదు అధి కారులు(ఈఆర్వోలు), సహాయ ఎన్నికల
నమోదు అధికారుల (ఏఈఆర్వోలు) తో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణపై నిర్వహించిన
సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా జనాభా, మొత్తం ఓటర్లు, పోలింగ్
స్టేషన్ల వివరాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు.
3 రెవెన్యూ డివిజన్లు కలిగిన కృష్ణాజిల్లాలో మచిలీపట్నం పార్లమెంటరీ
నియోజకవర్గంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1754 పోలింగ్ స్టేషన్లు
ఉన్నాయని తెలిపారు. 2023 జనాభా అంచనా ప్రకారం జిల్లా జనాభా 18,97,529 ఉండగా
09-11-2022 నాటికి పురుష ఓటర్లు 7,28,924 మంది, మహిళా ఓటర్లు 7,63,447 మంది,
థర్డ్ జండర్ 90 మందితో కలిపి మొత్తం జిల్లాలో 14,92,461 మంది ఓటర్లు ఉన్నారని
ఆయనకు కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్ల నమోదుపై
మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా మరియు ఓటర్ల
నిష్పత్తి (ఈపీరేషియో) సవ్యంగా ఉండాలని ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు సూచించారు. నకిలీ
ఓటర్లు, ఇతర ప్రదేశాలకు వలస వెళ్లిన వారు, మరణించిన వారు, కొత్తగా వివాహం అయి
వేరే ఊళ్లకు వెళ్లిన వారు, పునరావృతం అయిన పేర్లు వంటి ఓటర్ల తొలగింపు విషయంలో
ఓటరు నమోదు అధికారులు ఇంటింటికీ తిరుగుతూ రూఢీ చేసుకొన్న తరువాత అప్డేట్
చేయాలన్నారు. అదేవిధంగా కొత్తగా ఓటు నమోదుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
కొత్తగా వివాహం అయ్యి గ్రామానికి వచ్చినవారు, 18-19 మధ్య వయస్సు వారి ఓటు
నమోదు విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఓటు నమాదు ప్రక్రియకు అమ్మఒడి,
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల లబ్దిదారుల జాబితాను ఆయా
ప్రభుత్వ శాఖలు, కళాశాలల నుంచి జాబితాను పొందడం ద్వారా కొత్త ఓటర్లుగా
చేర్చడానికి సులభమైన మార్గమన్నారు.
అదేవిధంగా ట్రాన్స్ జెండర్లు, నిరాశ్రయుల జాబితాను వికలాంగులు సంక్షేమం,
మెప్మా శాఖల నుండి జాబితాను పొంది అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు
చేయించాలన్నారు. ఈ విధమైన ప్రక్రియలను అవలంభిస్తూ ఎన్నికల నాటికి పూర్తి ఓటర్ల
జాబితాను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన జిల్లా
కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలసి చిలకలపూడి పాండురంగ జిల్లా
పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ స్టేషన్, బైరాగిపాలెంలోని అంగన్వాడీ
ప్రీప్రైమరీ స్కూల్ నందు పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. ఆయా పోలింగ్
స్టేషన్ పరిధిలోని ఓటర్ల జాబితా వివరాలను పోలింగ్ బూత్ అధికారులను అడిగి
తెలుసుకున్నారు. బైరాగిపాలెం గ్రామస్థులతో ఆయన ముచ్చటించారు. గ్రామంలో అందరికీ
ఓటరు కార్డులు ఉన్నాయా అని, కొత్తగా ఓటు నమోదుకు అధికారులు మీ వద్దకు
వస్తున్నారా అని గ్రామస్థులను ఆరా తీశారు. తామందరికి ఓటు కార్డులు ఉన్నాయని,
కొత్తవారికి ఓటు నమోదు చేస్తున్నారని గ్రామస్థులు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం
చేశారు.
కార్యక్రమానికి ముందు తొలిగా జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల
అధికారికి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్
కుమార్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అధికారులతో సమావేశం అనంతరం శాలువాతో
ఆయనను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు,
మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు డివిజన్ల ఆర్డీఓలు ఐ.కిషోర్, పి. పద్మావతి,
విజయ్ కుమార్, ముడా వీసీ నారాయణరెడ్డి, కలెక్టరేట్ తహసీల్దార్ ఎం.హరనాద్,
వివిధ శాఖల అధి కారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.