రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
విజయవాడ : వైదిక ధర్మ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి
కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. విజయవాడ రూరల్ నున్న పరిధి చినకంచి
మహాక్షేత్రంలో ‘సనాతన ధర్మ పరిరక్షణ సేన’ పంచమ వార్షిక కార్తీక వనసమారాధన
బుధవారం సందడిగా జరిగింది. ఉదయం మహాలింగార్చన, సామూహిక విష్ణు, లలిత సహస్రనామ
పారాయణం నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఉసిరి చెట్టు కింద ప్రత్యేక
పూజలు నిర్వహించి విందులు చేశారు. విజయవాడ పురోహిత సంఘం, సత్యనారాయణపురం
పురోహిత సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మల్లాది విష్ణు ముఖ్య
అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హిందూధర్మం సనాతనమైనదని.. ప్రతి ఒక్కరూ
క్రమశిక్షణతో ఆ ధర్మ మార్గాన్ని అనుసరిస్తే సమాజం సుభిక్షంగా ఉంటుందని
తెలిపారు. వేద పరిరక్షణ, సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపచేయడంలో చినకంచి
క్షేత్రం ముందువరుసలో ఉంటుందన్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం
ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో వేద పారాయణం జరిగిందని గుర్తుచేశారు. సదానంద స్వామి
వారి దివ్య సందేశ సారాన్ని స్వీకరించి ప్రతిఒక్కరూ ధార్మిక ప్రవర్తనతో
తరించాలని సూచించారు. మన వేద విజ్ఞాన విలువలను పరిరక్షిస్తూ.. భారతీయ సంస్కృతి
– సంప్రదాయాలను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. చినకంచి క్షేత్ర
అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తానని తెలియజేశారు.
అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా టీటీడీ సూపర్
వైజర్ గుళ్లపల్లి శివ అవధాని, కప్పగంతు జ్వాల వెంకట రామలింగ ఘనాపాటి
హవిరియాజి, పాలపర్తి శ్యామల, నంద ప్రసాద్, చినకంచి క్షేత్రం ధర్మకర్తలు,
దేవస్థానం సభ్యులు పాల్గొన్నారు.