మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని
ఏలూరు : సంక్షేమ పాలనతో జగనన్న ప్రభుత్వం ప్రజలకు ఎంతో అండగా ఉంటుందని మాజీ
ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. గురువారం ఏలూరులో 48వరోజు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ 40వ డివిజన్
16 సచివాలయ పరిధిలోని చేపల తూము సెంటర్ ఏటిగట్టు, తుమరాడ వారి వీధి, బౌరోతు
వారి వీధి ప్రాంతాల్లో ఆళ్ల నాని పర్యటించారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా
40వ డివిజన్ కు విచ్చేసిన ఆళ్ల నానికి స్థానిక కార్పొరేటర్ తుమరాడా స్రవంతి
ఆధ్వర్యంలో డివిజన్ వైయస్సార్ సిపి నాయకులు , కార్యకర్తలు, మహిళలు, ప్రజలు ఘన
స్వాగతం పలికారు. భారీ గజమాలలు, పూల వానలు, మహిళల మంగళ హారతులు నడుమ ఉత్సాహంగా
సాగుతున్న 48వ రోజు గడప గడపకు కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తూ గడప గడపకు
పాదయాత్రగా ఆళ్ల నాని పర్యటించారు. సంక్షేమ పాలనతో తమకు జగనన్న ప్రభుత్వం ఎంతో
అండగా నిలుస్తుందంటూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.