1.54 కోట్ల మందికి ఉచితంగా పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండోవిడత కంటివెలుగు కార్యక్రమాన్ని జనవరి 18
నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 1.54
కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయనుంది. ఈ నేత్ర వైద్య శిబిరాల ద్వారా
25 లక్షల మందికి దగ్గరి చూపు కళ్లద్దాలు, 15 లక్షల మందికి దూరపు చూపు.
మొత్తంగా 40 లక్షలకు పైగా కళ్లద్దాలు అందజేయాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ
అంచనా వేసింది.