భాషా పరిశోధన కేంద్రం సంయుక్త నిర్వహణలో రా.రా. (రాచమల్లు రామచంద్రారెడ్డి)
శతజయంతి సదస్సును నవంబరు 24 గురువారం ఉదయం 10 గంటలకు సి.పి.బ్రౌన్ భాషా
పరిశోధన కేంద్రంలో నిర్వహించనున్నామని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం
బాధ్యులు డా. మూల మల్లికార్జున రెడ్డి మీడియకు తెలిపారు. ప్రారంభ సమావేశంలో
ముఖ్యఅతిథిగా యోగి వేమన విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి,
సభాధ్యక్షులుగా సాహిత్య అకాదెమి తెలుగు సలహా మండలి కన్వీనర్ కె.శివారెడ్డి,
గౌరవ అతిథిగా సాహిత్య అకాదెమి పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
పాల్గొననున్నారు. సాహిత్య అకాదెమి తెలుగు సలహా మండలి సభ్యులు డా॥ యాకూబ్
కీలకోపన్యాసం చేయనున్నారు, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా.
మూల మల్లికార్జున రెడ్డి సభా ప్రస్తావన చేయనున్నారు. తదనంతరం జరిగే మొదటి
సదస్సుకు రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అధ్యక్షత వహించనున్నారు ‘మార్క్సిస్టు
విమర్శకుడుగా రారా’ అనే అంశంపై, చింతకుంట శివారెడ్డి ‘రారా జీవితం,
వ్యక్తిత్వం’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయనున్నారు.
భోజనానంతరం జరిగే రెండవ సదస్సుకు కిన్నెర శ్రీదేవి అధ్యక్షత వహించి
‘కథారచయితగా రారా’ అనే అంశంపై, తుమ్మలూరు సురేష్‌బాబు ‘పాత్రికేయుడుగా రారా’
అనే అంశంపై పత్ర సమర్పణ చేయనున్నారు మూడవ సదస్సుకు మందలపర్తి కిశోర్ అధ్యక్షత
వహించి ‘అనువాదకుడుగా, అనువాద అధ్యయనశీలిగా రారా’ అనే అంశంపై,
ఆర్.రాజేశ్వరమ్మ ‘రారా లేఖలు, ముందుమాటలు’ అనే అంశంపై పత్ర సమర్పణ
చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ముగింపు సమావేశానికి యోగి వేమన
విశ్వవిద్యాలయం కులసచివులు ఆచార్య దుర్భాక విజయ రాఘవ ప్రసాద్ అధ్యక్షత
వహించనున్నారు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా.మూల
మల్లికార్జున రెడ్డి కార్యక్రమ నివేదికను సమర్పించనున్నారు విశ్రాంత ఆకాశవాణి
సంచాలకులు డా॥ తక్కోలు మాచిరెడ్డి సమాపన ప్రసంగం చేయనుండగా సి.పి.బ్రౌన్ భాషా
పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి వందన
సమర్పణతో కార్యక్రమం ముగియనున్నది