విజయవాడలో సెర్ప్ కార్యాలయంలో ‘‘అన్ని రాష్ట్రాలలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా
జాతీయ ప్రచారం’’ అంశంపై స్టేట్ లెవల్ వర్క్ షాప్ నిర్వహణ
విజయవాడ : దేశవ్యాప్తంగా 75 ’జెండర్ రిసోర్స్ సెంటర్స్’ను ఈ నెల 25న భారత
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభిస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలనా
సంస్థ (సెర్ప్) ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎ.ఎమ్.డి ఇంతియాజ్ తెలిపారు.
‘‘అన్ని రాష్ట్రాలలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం’’ అంశంపై
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవన్ లో
సెర్ప్ కార్యాలయములో శుక్రవారం ఎ.ఎమ్.డి. ఇంతియాజ్ అధ్యక్షతన స్టేట్ లెవెల్
వర్క్ షాప్ కి నిర్వహించారు. ఈ సమావేశానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు,
స్టేట్ లీగల్ సర్వీస్ అధారిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
డిపార్టుమెంటు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్, మెప్మా
(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ), వెల్ఫేర్ అఫ్ డిఫరెంట్లి ఆబిల్డ్ సీనియర్
సిటిజెన్ అండ్ ట్రాన్స్ జెండర్, సర్వశిక్షా అభియాన్ డిపార్ట్ మెంట్ ల నుండి
యూనిసెఫ్, మురళీకృష్ణ మెమోరియల్ ట్రస్ట్, వాసవ్య మహిళా మండలి, రైతు సాధికారత
సంస్థ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి ఎన్ ఆర్ ఎల్ ఎం ఎన్ ఆర్
పీ (నేషనల్ రిసోర్స్ పర్సన్), సెర్ప్ అధికారులు హాజరై వారి సలహాలు, సూచనలు
తెలియజేశారన్నారు. వారి సూచనలను పరిగణన లోకి తీసుకుని 25, నవంబర్ నుండి 23,
డిశంబర్ 2022 వరకూ చేయవలసిన ప్రచారానికి ప్రణాళిక రూపొందించి అమలు
చేస్తామన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు లింగ అసమానత్వ
సమస్యలు ఎదుర్కోవడం కోసం, నిర్మాణాత్మకమైన వ్యూహాలను అమలు చేయడం కోసం డే ఎన్
ఆర్ ఎల్ ఎం ద్వారా స్వయం సహాయక సంఘాలు, ఇతర ప్రభుత్వ విభాగాలు, వివిధ సివిల్
సొసైటీ ఆర్గనైజేషన్స్ అనుసంధానంతో ఈ నెల 25 నుండి డిశంబర్ 23వ తేదీ వరకూ అన్ని
రాష్ట్రాలలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం నిర్వహించాలని సూచించడం
జరిగిందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించే క్యాంపెయిన్ థీమ్ “భయం,
వివక్ష, హింస లేకుండా గౌరవప్రదమైన జీవితానికి నిర్మాణాత్మక అడ్డంకులను
పరిష్కరించడం ద్వారా మహిళలు, లింగ-వైవిధ్య వ్యక్తుల యొక్క హక్కులను, సంస్థలను
ముందుకు తీసుకువెళ్ళడం” అని ఇంతియాజ్ తెలిపారు. అందరి సమన్వయంతో
కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎ.ఎమ్.డి ఇంతియాజ్ కోరారు.