వ్యర్థాల నిర్వహణపై జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్జీటీ) మార్గదర్శకాలు విడుదల
విజయవాడ : న్యూఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్జీటీ) సంస్థ
మార్గదర్శకాలకు అనుగుణంగా ఘన, ద్రవ వ్యర్థాలు, మురుగు నీటి నిర్వహణపై
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ఎన్జీటీ సంతృప్తి వ్యక్తం
చేసింది. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యర్థాల నిర్వహణపై సరైన చర్యలు
తీసుకోని కారణంగా తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక
తదితర రాష్ట్రాలకు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నాయకత్వంలోని ఎన్జీటీ భారీగా
పెనాల్టీ విధించింది. ద్రవ వ్యర్థాల నిర్వహణకు మిలియన్ లీటర్లకు రూ.2 కోట్ల
చొప్పున, ద్రవ వ్యర్థాల నిర్వహణలో మెట్రిక్ టన్నుకు రూ.300 వంతున పెనాల్టీ
విధించింది. ఈ మేరకు రాజస్థాన్ కు రూ.3,000 కోట్లు, మహారాష్ట్ర కు రూ.12,000
కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.3,000 కోట్లు, తెలంగాణకు రూ.3,800 కోట్లు,
కర్ణాటకకు రూ. 2,900 కోట్ల అపరాధ రుసుము విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి
గతంలో ఎన్జీటీ నోటీసులు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఘన, ద్రవ
వ్యర్థాలు, మురుగు నీటి నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను పరిశీలించిన కమిషన్
సంతృప్తి వ్యక్తం చేసిన ట్రిబ్యూనల్ నిర్ణీత కాల వ్యవధిలోగా పనులు పూర్తి
చేయాలని ఆదేశిస్తూ నోటీసులను ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో మెరుగైన పారిశుధ్ధ్య
నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో “జగనన్న
స్వచ్ఛ సంకల్పం..క్లీన్ ఆంధ్రప్రదేశ్” అమలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని
గ్రామాలను, నగరాలను పరిశుభ్రంగా మార్చేందుకు బిన్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ,
గార్బేజ్ ఫ్రీగా అభివృద్ధి పరచడమే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్థాలను వేరు చేసి ఇంటి వద్దనే సేకరించేందుకు
వీలుగా ఇంటికి 3 చొప్పున 1.21 కోట్ల డస్ట్ బిన్ లను పంపిణీ చేసింది. అంతేగాక
పొడి చెత్త నుండి హానికారక వ్యర్థాలను నిర్మూలించుట, తిరిగి ఉపయోగించదగిన
వస్తువులను వినియోగంలోకి తీసుకువచ్చే ప్రక్రియలను కూడా చేపట్టడం జరిగింది.
తడి చెత్తను, పొడి చెత్తను విడివిడిగా సేకరించి రవాణా చేసేందుకు వీలుగా
జీపీఎస్ ట్రాకింగ్ తో కూడిన 2,737 గార్బేజ్ ఆటో టిప్పర్లు, 287 ఈ-ఆటోలు, 880
ట్రక్కులు, టిప్పర్లు, ట్రాక్టర్లు, 480 కంపాక్టర్లను వినియోగిస్తున్నారు.
సేకరించిన చెత్తను తాత్కాలికంగా నిల్వచేసి ప్రాసెసింగ్ ప్లాంట్లకు చేర్చే
ప్రక్రియలో భాగంగా 123 మున్సిపాలిటీల్లో 138 గార్బేజ్ ట్రాన్స్ ఫర్
స్టేషన్లు(జీటీఎస్ ) ను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 123
మున్సిపాలిటీల్లో రోజుకు 6,890 టన్నుల ఘన వ్యర్థాలను, 86 లక్షల మెట్రిక్
టన్నుల ప్రమాదకర వ్యర్థాలను, 1503 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలను ప్రాసెసింగ్
చేయడం జరుగుతుంది. లక్ష మంది జనాభా తక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో స్లడ్జ్
ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటుతో 71 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్
నందు తడి చెత్త నుండి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. లక్ష జనాభా కంటే
అధికంగా ఉన్న పురపాలక సంఘాల్లో రూ.1,436 కోట్లతో, లక్ష లోపు జనాభా ఉన్న
ప్రాంతాల్లో రూ.1,445 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. జగనన్న స్వచ్ఛ
సంకల్పం- క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం
తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ఖర్చును పరిశీలించి సంతృప్తి చెందిన
ట్రిబ్యూనల్ ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి అపరాధ రుసుములు విధించకుండా మినహాయింపు
ఇచ్చింది.