అనుమానం పేరిట మహిళలపై కత్తిదూస్తారా..?
అనంతపురం, తెనాలి ఘటనలపై ‘మహిళా కమిషన్’ కన్నెర్ర
కఠినచర్యలకు అనంత, గుంటూరు ఎస్పీలకు ‘ వాసిరెడ్డి పద్మ’ ఆదేశం
అమరావతి : అనుమానం పేరిట కత్తులు దూస్తూ మహిళల ప్రాణాల్ని తీసే సైకో భర్తల్ని
సంఘ బహిష్కరణ చేయాలి. చట్టబద్ధంగా తేల్చుకోవాల్సిన భార్యాభర్త వివాదాలను
ప్రాణాలు తీసేదాకా తీసుకెళ్ళే పురుషాహంకార ధోరణి సమాజంలో మారాలి.. అని రాష్ట్ర
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి,
అనంతపురం జిల్లాలో అనుమానంతో మహిళల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న ఉన్మాదుల
చర్యలపై శుక్రవారం ఆమె తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దుర్మార్గుల ఆగడాలను సభ్య
సమాజం ఖండించాలన్నారు. అనంతపురం ఘటనకు సంబంధించి ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్న బాధితురాలిని మహిళా కమిషన్ సభ్యులు షేక్ రుకియాబేగం పరామర్శించగా
ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాసిరెడ్డి పద్మ ఆరాతీశారు. ఆమె త్వరగా కోలుకునేందుకు
మెరుగైన చికిత్స అందించాలని వాసిరెడ్డి పద్మ ప్రభుత్వ ఆస్పత్రి అధికారులను
సూచించారు. తెనాలి ఘటనపై గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అనంతపురం జిల్లా ఎస్పీ
ఫకీరప్పతో ఆమె మాట్లాడి నేరస్తులపై కఠినచర్యలు చేపట్టాలని ఆదేశించారు.