అరుణాచల్ ప్రదేశ్‌లో తొలి “గ్రీన్ ఫీల్డ్” విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు ఇదే తొలి విమానాశ్రయం కావడం
విశేషం. ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన మోడీ ఈశాన్య రాష్ట్రాలపై గత
ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ధ్వజమెత్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లో తొలి
“గ్రీన్ ఫీల్డ్” విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
ఇటానగర్‌లోని హెల్లంగి ప్రాంతంలో నిర్మించిన ఈ “డోనీ-పోలో” విమానాశ్రయాన్ని
జాతికి అంకితం చేశారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్‌లో తొలి ఎయిర్‌పోర్టు
అందుబాటులోకి వచ్చింది. 2019 నవంబర్‌లో మోదీ ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి
శంకుస్థాపన చేయగా సుమారు రూ.645 కోట్లతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా
నిర్మించింది. ఈ సందర్భంగా ప్రసంగించిన నరేంద్ర మోడీ గత ప్రభుత్వాలపై
విమర్శలు గుప్పించారు. నేను 2019లో శంకుస్థాపన చేసినప్పుడు కొంత మంది
రాజకీయనేతలు విమర్శించారు. అసలు ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించరని, ఎన్నికల కోసమే
మోదీ శంకుస్థాపన చేస్తున్నాడని అన్నారు. తాజా ప్రారంభోత్సవంతో వారికి గట్టి
దెబ్బ తగిలినట్టు అయ్యింది. స్వాతంత్య్రం తరువాత ఈశాన్య రాష్ట్రం భిన్నమైన
యుగానికి సాక్షిగా మారింది. దశాబ్దాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి
బలైపోయింది. వాజ్‌పేయీ ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితిని మార్చేందుకు కృషి
జరిగింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు
చేసిన మొదటి ప్రభుత్వం అటల్దే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని ముందుకు
తీసుకెళ్లలేదు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను సుదూర ప్రాంతాలని
అనుకునేవి. కానీ మా ప్రభుత్వం వాటికీ ప్రాధాన్యం ఇచ్చింది. సేవ చేసేందుకు మీరు
నాకు అవకాశం కల్పించారు. దీంతో ఈశాన్యంలో మార్పు తెచ్చేందుకు మరో శకం
ప్రారంభమైనట్లైందని నరేంద్ర మోడీ అన్నారు.