సర్పంచ్ లు గ్రామపంచాయతీల కరెంటు బిల్లులు కట్టవద్దు
పాత పద్దతిలో రాష్ట్ర ప్రభుత్వమే కరెంటు బిల్లులను చెల్లించాలి.
రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన సర్పంచుల నిధులు రూ.8660 కోట్ల ను వెంటనే తిరిగి
ఇవ్వాలి.
సర్పంచ్లకు, ఎంపిటిసి లకు రూ,, 15000 గౌరవ వేతనం ఇవ్వాలి
వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ రోజు
ఉదయం విజయవాడ బాలోత్సవ భవన్లో రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్
అధ్యక్షతన జరిగినాయి. ఈ సమావేశానికి 26 జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ ఛాంబర్,
సర్పంచుల సంఘాలకు చెందిన జిల్లా, రాష్ట్ర కమిటీ నాయకులు హాజరయ్యారు. ఈ
సందర్భంగా వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ ప్రారంభ, అధ్యక్షోపన్యాసం చేస్తూ
“ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామానికి సేవ చేద్దామని ఎన్నో ఆశలతో, ఆశయాలతో
సంవత్సరం క్రితం ఎన్నికై వచ్చిన సర్పంచులు పలు ఇబ్బందులు పడుతున్నారు. 73,74 వ
రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా,
న్యాయబద్ధంగా రాష్ట్రప్రభుత్వం సర్పంచులకు ఇవ్వవలసిన నిధులు, విధులు
అధికారాలను ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన (2018 – 19 నుంచి 2021 -22
వరకు) 14,15వ ఆర్థిక సంఘంనిధులు రూ,, 8660 కోట్ల ను దారి మళ్ళించేసుకొని, తన
సొంత అవసరాలకు రాష్ట్రప్రభుత్వం వాడేసుకోవడంతో గ్రామాలు నిర్వీర్యమై
పోతున్నాయి, సర్పంచులు ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోతున్నారని రాష్ట్ర
ప్రభుత్వం దొంగలించిన ఆ రూ.8660 కోట్లు మా సర్పంచులకు తిరిగి ఇవ్వాల్సిందేనని
రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.
బుగ్గన ప్రకటనకు ప్రశ్నలు – విద్యుత్ బకాయిలపై
అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్రం పంపిన
ఆర్థిక సంఘం నిధులు కరెంటు బిల్లుల కు జమ చేసుకున్నాం అనడం అన్యాయం, అనైతికం
అన్నారు. అదే విధంగా నిజంగా మీరు కరెంటు బిల్లులు కట్టి ఉంటే మా గ్రామ
పంచాయతీల కరెంటు బిల్లులు కట్టినట్లు రసీదులు మా సర్పంచ్లకు ఎందుకు
పంపించలేదని , ఇప్పటికీ కూడా కరెంటు బకాయిలు చెల్లించాలని మా సర్పంచ్ ల పై
విద్యుత్ అధికారులు తీవ్ర ఒత్తిడి ఎందుకు చేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్
అన్నారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రభుత్వం
మేము అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
1)గ్రామా పంచాయితీలకు కరెంటు మీటర్లు ఉన్నాయా ?
2) మీటర్ల లో కరెంటు ఎన్ని యూనిట్లు కాలింది రీడింగ్ తీసి
గ్రామపంచాయితీలకు ఇచ్చినారా ?
3) గ్రామా పంచాయితీలకు కరెంటు బిల్లు ఎంత కట్టాలి అని చెప్పి బిల్లు
ఇచ్చినారా ?
4 ) కరెంటు బకాయిల కింద జమ చేసుకున్న 8660 కోట్లకు ఆయా పంచాయతీలకు – డబ్బులు
కట్టినట్లు ఎందుకు రసీదులు విద్యుత్ శాఖ వారు మా సర్పంచులకు ఇవ్వడం లేదు?
5) గ్రామాపంచాయితీల లో నిధులు జమ చేసి సర్పంచ్ సంతకం లేకుండా మీరు ఎలా
డ్రాచేస్తారు ?
6) రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వం మీ లాగా దొంగతనం గా డ్రాచేస్తే
మీరు ఉరుకొంటారా ?
7) మీరు రాష్ట్రానికి ఎంత జవాబు దారిగా ఉంటారో ! సర్పంచ్ గ్రామానికి అంతే
సార్ !
8) మీరు ఆర్థిక మంత్రిగా ఉండి తప్పు చేస్తే చదువు కొన్న వారికీ తప్పా
ఎవ్వరికి తెలియదు !
9) మా సర్పంచ్ తప్పు చేస్తే చదువు ఉన్నా లేకపోయినా గ్రామం మొత్తానికి
తెలుసుద్ది. పేపర్ వాళ్ళు ,మీడియా వాళ్ళు కోడి కూతకన్నా ఎక్కువగా ఉంటుంది .
9) ఈ రోజు ఉన్న సర్పంచులకు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిధులు , కేంద్ర
ప్రభుత్వ నిధులు ఎంత ఇచ్చినారు ?
చెప్పగలరా ?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి మంత్రిగారు ? మీరు 14,15 ఆర్థిక సంఘం నిధులు
ఎలా ఖర్చు చేసినది .కేంద్రప్రభుత్వానికి. ,”యూ సి” ఇచ్చినారా ! లేదా ! మీరు
రాష్ట్రము లో ఉన్న సర్పంచులు అందరికీ సమాధానం చెప్పాలని కోరారు. అసలు గత
ముఖ్యమంత్రులు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ , నారా చంద్రబాబునాయుడు, వైయస్ రాజశేఖర్
రెడ్డి మైనర్ పంచాయతీలకు విద్యుత్ ఫ్రీగా ఇచ్చారని, మరి మీరు మాత్రం పాత
బకాయిలంటూ కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులన్నీ దారి మళ్లించి
విద్యుత్ బకాయిలు కింద జమ చేసుకున్నామని చెప్పడం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని,
ఇప్పటికైనా మీరు చెప్పే కట్టుకథలు పక్కనబెట్టి కేంద్ర ప్రభుత్వం పంపించిన
ఆర్థిక సంఘం నిధులు రూ. 8660 కోట్ల ను వెంటనే మా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ
చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్రప్రసాద్ కోరారు. రాష్ట్రంలోని సర్పంచ్
లెవ్వరు కరెంటు బకాయిలు కట్టవద్దని, పాత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వమే కరెంటు
బిల్లులు చెల్లించాలని రాజేంద్రప్రసాద్ సర్పంచులకు పిలుపునిచ్చారు. 15 వ
ఆర్థిక సంఘం నిధులు కరెంటు బిల్లులు చెల్లించమని ప్రభుత్వం ఇచ్చినటువంటి
మెమోను ఉపసంహరించుకోవాలని, రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ లు ఉద్యమాన్ని ఉదృతం
చేసి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని అన్నారు. అంతేకాక గ్రామాల్లో ఇవాళ
సర్పంచుల కన్నా వాలంటీర్ల కే ఎక్కువ విలువ ఉంది. గౌరవ వేతనం కూడా సర్పంచులకు
రూ.3000, వాలంటీర్లకు రూ.5000 గా ఎక్కువ ఉంది. కనుక సర్పంచులకు, ఎంపీటీసీ లకు
రూ, 15000, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ.30000, కౌన్సిలర్ లకు రూ.20000,
కార్పోరేటర్ లకు రూ.30000 లను గౌరవ వేతనాలు గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని
రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. అందుకే మమ్ములను నమ్మి మాకు ఓటేసిన మా
గ్రామాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం, మహాత్మా గాంధీ కలలుగన్న
గ్రామస్వరాజ్య సాధన కోసం మేము కోరుతున్న డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని
రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. లేకపోతే మా
న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం, మమ్ములను గెలిపించిన మా గ్రామీణ ప్రజల
సంక్షేమం కోసం, రాష్ట్రంలోని 12918 మంది సర్పంచు లం రాజకీయాలకతీతంగా ఐక్యమై
ఉద్యమిస్తామని, రాజీలేని పోరాటాలు చేస్తామని మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం,
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్లు హెచ్చరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని
రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల
సంఘం నాయకులు ముల్లంగి రామకృష్ణారెడ్డి (కృష్ణాజిల్లా), బిర్రు ప్రతాప రెడ్డి
(కర్నూలు జిల్లా), సింగంశెట్టి సుబ్బరామయ్య (తిరుపతి జిల్లా), కాసర నేని
మురళి (కృష్ణాజిల్లా), అనేపు రామకృష్ణ నాయుడు (శ్రీకాకుళం జిల్లా), చుక్క
ధనుంజయ్ యాదవ్ (చిత్తూరు జిల్లా), వానపల్లి ముత్యాలరావు (విశాఖ జిల్లా),
చింతకాయల ముత్యాలు (అనకాపల్లి జిల్లా), బొర్రా నాగరాజు (అల్లూరి సీతారామరాజు
జిల్లా), కడలి గోపాలరావు పశ్చిమ (గోదావరి జిల్లా), ఎం శివ శంకర్ యాదవ్
(కృష్ణాజిల్లా), ఎస్ మునిరెడ్డి (కడప జిల్లా), రంగయ్య (అనంతపురం జిల్లా),
బెజవాడ శ్రీరామ్మూర్తి (ప్రకాశం జిల్లా), గోగినేని వసుధ, మానం విజేత (గుంటూరు
జిల్లా), రావి పాటి సంధ్య, ఎలవర్తి లక్ష్మి, డేగల కృష్ణమూర్తి, వీరభద్రయ్య,
వసంత కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశాలు ఈ రోజు, రేపు
జరుగుతాయి. సర్పంచుల, గ్రామాల సమస్యలపై సవివరంగా చర్చించి, తీర్మానాలను చేసి,
భవిష్యత్ కార్యాచరణ, ఆందోళన కార్యక్రమాలను రూపొందించి రేపు విడుదల చేయడం
జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర
సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బిర్రు
ప్రతాప్ రెడ్డి తెలిపారు.