బంగ్లాదేశ్ లో ఉరిశిక్ష పడిన ఇద్దరు కరడుకట్టిన ఉగ్రవాదులు కోర్టు
ప్రాంగణంలోనే సినీ ఫక్కీలో తప్పించుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.
కోర్టునుంచి తరలిస్తున్న క్రమంలో దుండగులు తప్పించు కున్నారు. ఈ ఘటన
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కోర్టు వద్ద జరిగింది. ప్రముఖ బంగ్లాదేశ్-అమెరికన్
బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన పబ్లిషర్ ఫైజల్ అరెఫిన్ డిపన్‌ల హత్య కేసుల్లో
అన్సురుల్లా బంగ్లా టీం ఉగ్రవాద సంస్థకు చెందిన మెయినుల్ హసన్ షమీమ్, అబు
సిద్ధిఖ్ సోహెల్‌లకు గతేడాది కోర్టు మరణశిక్ష విధించింది. వేరే కేసుల్లోనూ
నిందితులైన వీరిని విచారణ కోసం ఢాకా కోర్టుకు తీసుకొచ్చారు. ఢాకా కోర్టునుంచి
తరలిస్తున్న క్రమంలో దుండగులు తప్పించుకున్నారు. ఉగ్రవాదులు ఫిబ్రవరి 2015లో
అవిజిత్ రాయ్‌ను హతమార్చారు. అదే ఏడాది నవంబరులో డిపన్ను కూడా హత్యచేశారు.