*రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చంద్రబాబు కుట్రలు*
*ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర టీడీపీకి లేదు*
*ఎప్పుడెన్నికలొచ్చినా వైసీపీ విజయం ఖాయం*
*గడప గడపకు మన ప్రభుత్వం లో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి *
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, జనం
హృదయాల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని అనంతపురం ఎమ్మెల్యే అనంత
వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇలాంటి తరుణంలో ఎలాగైనా ప్రజలను రెచ్చగొట్టి
లబ్ధిపొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సోమవారం అనంతపురం
నగరంలోని 20, 30వ డివిజన్లలో కార్పొరేటర్లు లావణ్య, నరసింహులుతో కలిసి గడప
గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఉదయం 20వ డివిజన్లో అనంతపురం ఎంపీ తలారి
రంగయ్యతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను
వివరించారు. సాయంత్రం 30వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టారు. వివిధ
పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధికి సంబంధించి రూపొందించిన
బుక్లెట్లను ఎమ్మెల్యే అనంత పంపిణీ చేశారు. స్థానికంగా రోడ్లు, డ్రెయినేజీ
సమస్యలపై నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు
తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు నిత్యం ప్రజలకు
అందుబాటులో ఉండాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని
తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ తాము గడప గడపకు వెళ్తున్న సందర్భంలో
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో పాటు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల
ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రమే నిరాశ
నిష్పృహల్లో కొట్టమిట్టాడుతున్నారని అన్నారు. ఎలాగైనా రెచ్చగొట్టి
లబ్ధిపొందాలన్న తాపత్రయం చంద్రబాబులో కనపడుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ వల్ల
తమకు ఎలాంటి ప్రయోజనం లేదన్న భావన ప్రజల్లో ఉందని స్పష్టం చేశారు. గతంలో
ఎన్నడూ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదని,
ఇప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. ఎంత మంది వచ్చినా 2024
ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. గడప గడపకు వెళ్తున్న
సందర్భంగా తమ దృష్టికి వస్తున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సచివాలయం పరిధిలో
రూ.20 లక్షలతో పాటు జనరల్ ఫండ్స్‌ను కేటాయించి డ్రెయినేజీలు, రోడ్ల
నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమాల్లో మేయర్ మహమ్మద్ వసీం,
డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్ యార్డు
చైర్మన్ ఫయాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌస్‌బేగ్,
పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.