దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే వన్డే ట్రోఫీ-2022లో తమిళనాడు జట్టు
సంచలన ప్రదర్శన చేసింది. ఊహకందని స్కోరును సాధించి సత్తా చాటింది. అరుణాచల్
ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు జట్టు 50 ఓవర్లలో
2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 506 పరుగులు చేసింది. వన్డే (లిస్ట్ ‘ఎ’ను
కలుపుకని) క్రికెట్ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం
విశేషం. ఈ మ్యాచ్ లో నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15
సిక్సర్లు) అద్భుత డబుల్ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ (102 బంతుల్లో 154;
19 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా శతకంతో కదంతొక్కాడు. దీంతో తమిళనాడు భారీ స్కోరు
సాధించింది.