విద్యా రంగ నిపుణులు, విద్యా సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఈనెల 26న టీహబ్ వేదికగా ప్రధానం చేయనున్న టీటా
హైదరాబాద్ : విద్యారంగంలో ఇన్నోవేటివ్, డైనమిక్, నూతన విప్లవాత్మక
విధానాలను అందిపుచ్చుకుంటున్న విద్యా సంస్థలు మరియు వ్యక్తులను
ప్రోత్సహించడం లక్ష్యంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్
(టీటా) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యారంగంలో అధునాతన విధానాలను అభివృద్ధి
చెందించే ప్రక్రియలను ప్రోత్సహించడం అనే లక్ష్య సాధనలో భాగంగా విశిష్ట
వ్యక్తులు, సంస్థలకు టీటా ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్అవార్డులు అందించనుంది.
ఈనెల 26న టీహబ్ వేదికగా ప్రధానం చేయనున్న ఈ అవార్డులకు సంబంధించి టీటా
దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత తరుణంలో విద్యా రంగంలో అనేక
విప్లవాత్మక నూతన నిర్ణయాలు, మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ మార్పులను విద్యా విధానంలో భాగం చేయడం ద్వారా ఇటు బోధన అటు నాణ్యమైన
మానవ వనరులను తీర్చిదిద్దడంలో పలు విద్యాసంస్థలు, విద్యా వేత్తలు
క్రియాశీలంగా కృషి చేస్తున్నారు.
ఐటీ పరిశ్రమలో టీటా ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ఇటు
ప్రభుత్వపరంగా, అటు ఉద్యోగుల పరంగా చేపట్టి విజయవంతంగా ముందుకు
తీసుకుపోతోంది. ఈ క్రమంలో విద్యా రంగంలోని నూతన మార్పుల విషయంలో కృషి
చేస్తున్న విశిష్ట వ్యక్తులు, వ్యవస్థలను గుర్తించి, గౌరవించేందుకు
టీటా ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లను ప్రవేశపెట్టింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ అయిన టీహబ్ 2.0 వేదికగా ఈ
అవార్డులను ఈ నెల 26న ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులకు దరఖాస్తు
చేసుకునేందుకు చివరి తేదీ ఈనెల 24 వ రాత్రి 11.59 నిమిషాల వరకు
సమర్పించవచ్చు. టీటా ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కోసం పాఠశాలలు,
కాలేజీలు, యూనివర్సిటీలు, ఎడ్టెక్ కంపెనీలు, విద్యార్థులు, టీచర్లు మరియు
ఫ్యాకల్టీలు వివిధ కేటగిరీలలో తమ దరఖాస్తులు bit.ly/teeawards లింక్
ద్వారా సమర్పించుకోవచ్చు. మరింత సమాచారం కోసం 8897030879 లేదా 8123123434
నంబర్లను సంప్రదించవచ్చు.